ఎర్రిపు : మూతి ముద్దులు.. బోల్డ్ హగ్గులు.. అభిప్రాయాలు మారుతాయ్ అంటే ఎలా..?

shami

స్టార్ సినిమా చిన్న సినిమా అనే తేడా లేకుండా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలి అంటే హీరో హీరోయిన్ మూతి ముద్దులు కంపల్సరీ అయ్యింది. ఏవో కొన్ని సంప్రదాయబద్ధమైన సినిమాల్లో తప్ప మ్యాక్సిమం సినిమాల్లో ఈ లిప్ లాక్ ట్రెండ్ కొనసాగుతుంది. ఇక కొన్ని సినిమాలైతే వాటి కోసమే అన్నట్టుగా తీస్తున్నారు అది వేరే విషయం. ఇదిలాఉంటే రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. ఈ సినిమాలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్ త్రెసా, ఇజాబెల్లా హీరోయిన్స్ గా నటించారు.

 

ఈ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజైంది. ఇన్నాళ్లు చాలా పద్ధతిగా సినిమాలు చేసిన రాశి ఖన్నా కూడా ఇలా లిప్ లాక్స్ చేయడంపై ఆమె ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. టీజర్ లోనే రాశి ఖన్నా బోల్డ్ అవతార్ చూసి షాక్ అయ్యారు. ఇక ఈ ట్రైలర్ దాన్ని మించి ఉంది. అయితే ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ లో మాట్లాడిన రాశి ఖన్నా తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ చేసిన కామెంట్స్ గురించి పక్కన పెడితే ఈ సినిమా చూశాక వాళ్ల అభిప్రాయాలు మార్చుకుంటారని అన్నది.

 

టీజర్ రిలీజ్ అయిన టైం లోనే తన అభిమానులు తను అలా బోల్డ్ గా నటించడం పట్ల అసంతృప్తిని వ్యక్తపరిచారట. అయితే ఈ విషయంపై స్పందించిన రాశి ఖన్నా ఇలాంటి పాత్ర చేసినందుకు సంతోషంగా, గర్వంగా ఫీలవుతున్నానని అన్నారు. సినిమాతో నటుడిగా విజయ్ దేవరకొండని మరోస్థాయిలో నిలబెడుతుంది ఈ సినిమా అన్నారు రాశి ఖన్నా. మొత్తానికి తన ఫ్యాన్స్ మాటని కూడా పెడ చెవిన పెట్టిన రాశి ఇక మీదట ఇలా రెచ్చిపోతాననే హింట్ ఇచ్చినట్టే ఉంది. అలా ముద్దులివ్వడం కథ డిమాండ్ చేసిందని చెప్పడం హీరోయిన్స్ కు కామనే కొత్తగా రాశి కూడా అలా చెప్పడం మొదలు పెట్టేసరికి ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: