హవ్వా.. వైస్ కెప్టెన్సీ ఇచ్చి.. బెంచ్ పై కూర్చోబెట్టారు?

praveen
ప్రపంచ క్రికెట్లో పాకిస్తాన్ జట్టు నిలకడలేమికి కేరాఫ్ అడ్రస్ గా కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే ఓడిపోతుంది అనుకున్న దీనస్థితి నుంచి అనూహ్యంగా పుంజుకొని  విజయం సాధించిన సందర్భాలు ఎన్ని ఉన్నాయో.. ఇక గెలుస్తుంది అన్న మ్యాచ్లో కూడా టపా టపా వికెట్లు కోల్పోయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సందర్భాలు కూడా అన్నే ఉన్నాయి అని చెప్పాలి. పాకిస్తాన్ జట్టులో ఎంతోమంది ప్రతిభగల ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఇక ఎప్పుడు నిలకడలేమిటో బాధపడుతూ ఉంటుంది ఆ జట్టు.

 అయితే ఆన్ ది ఫీల్డ్ లో మాత్రమే కాదు ఆఫ్ ద ఫీల్డ్ లో కూడా ఇక ఆ జట్టు తీసుకునే నిర్ణయాలు కూడా ఇలాగే ఉంటాయి అని చెప్పాలి. సాధారణంగా జట్టుకు కెప్టెన్ గా వైస్ కెప్టెన్ గా ఉన్న ఆటగాళ్లు కొన్ని కొన్ని సార్లు పేలవ ప్రదర్శన చేసిన ఇక జట్టులో కొనసాగించడం లాంటివి చూస్తూ ఉంటాము. కానీ పాకిస్తాన్ మాత్రం ఇటీవలే తీసుకున్న నిర్ణయం అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది. ఏకంగా జట్టుకు వైస్ కెప్టెన్ గా ఎంపిక చేసిన క్రికెటర్ ను బెంచ్ మీద కూర్చోబెట్టడం ఇక పాకిస్తాన్ కే చెల్లింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 న్యూజిలాండ్తో వన్డే సిరీస్ లో భాగంగా కరాచీ వేదికగా తొలి మ్యాచ్ ఆడింది పాకిస్తాన్. అయితే షాన్ మసూద్ ను వైస్ కెప్టెన్ గా నియమించింది. గతంలో బాబర్కు డిప్యూటీగా షాదబ్ ఖాన్ ఉండేవాడు. కానీ వేలికి గాయం కావడంతో అతను జట్టుకు దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో షాన్ మసూద్ కు డిప్యూటీ బాధ్యతలు అప్పగించారు. ఇలా ఏకంగా వైస్ కెప్టెన్ గా ఎంపికైన ఆటగాడిని మొదటి మ్యాచ్ లో బెంచికే పరిమితం చేయటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. షాన్ మసూద్ వైస్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టడం అటు కెప్టెన్ బాబర్కు అస్సలు ఇష్టం లేదు అన్న వాదన కూడా వినిపిస్తుంది. మ్యాచ్ కు ముందు జరిగిన మీడియా సమావేశంలో తాను ఎవరి గురించి మాట్లాడాలి అనుకోవట్లేదు.. అతను వైస్ కెప్టెన్ అయిన ఇంకెవరైనా నేను మాట్లాడను.. కేవలం జట్టు కోసం అద్భుతమైన ప్లేయింగ్ ఎలివెన్ ను మాత్రమే ఎంపిక చేసాం అంటూ బాబర్ వ్యాఖ్యానించడం మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: