మంచిమాట: ఎత్తుకు పై ఎత్తు వేయటమే సరైన ఉపాయం..

Divya

ఏదైనా సమస్య వచ్చినప్పుడు డీలా పడిపోకుండా, ఎత్తుకు పైఎత్తు వేసి ఆ సమస్యను చేధించినప్పుడే, మనము జీవితంలో ముందుకు సాగగలము. అయితే దీనిని ఉదాహరణగా తీసుకొని ఒక కథను తెలుసుకుందాం..
అనగనగా ఒక అడవిలో కుందేళ్లు అన్నీ ఒక చోట బాగా ఆడుకుంటూ ఉండేవి. అలా ఆడుకుంటున్న సమయంలో అటుగా వెళ్తున్న ఒక నక్క వీటిని చూసి ఇలా అనుకుంది.. ఏదో ఒక ఉపాయం వేసి రోజు ఒక కుందేలును ఆహారంగా తీసుకెళ్లి , కాలం గడిపితే అంతే చాలు అని అనుకుంది నక్క. అలా అనుకుని వాటి దగ్గరికి వెళ్లి ఏమర్రా.! ఈ విషయం తెలుసా..? మన అడవికి రాజైన సింహానికి జబ్బు చేసింది.నేను ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నాను అని చెప్పింది. అమాయకపు  కుందేళ్లు -నక్క చెప్పిన మాటలు విని, అయ్యో..!నిజమా.. అని విచారం వ్యక్తం చేశాయి.
రాజుగారికి పెద్ద కోతి ఒకటి వైద్యం చేస్తోంది. నెల రోజుల పాటు రోజుకు ఒక కుందేలు ని తింటే తప్ప ,ఆ జబ్బు నయం కాదు అని చెప్పింది. అందుకే మీలో ఒకరు ని పట్టుకు రమ్మని రాజు నాకు ఆజ్ఞ వేశాడని నమ్మబలికింది నక్క. ఇక ఆ మాటలు విని నమ్మి , రాజు అంటే భయం తోనో లేక భక్తితోనో  రోజుకో కుందేలు,  ఆహారంగా నక్క వెంట వెళ్ళ సాగేవి. ఇక నక్క దాన్ని చంపి, రాజు పేరు చెప్పి కడుపార మాంసం లాగిస్తుండేది. నాలుగు రోజుల తర్వాత రాజ వైద్యులు కోతి, కుందేలు దగ్గరకు వచ్చింది.
ఇక ఆ కుందేళ్లు రాజు గారి ఆరోగ్యం గురించి అడిగాయి. ఇక అది విన్న కోతి గట్టిగా నవ్వి , రాజుగారికి ఏ అనారోగ్యము లేదు. జిత్తులమారి నక్క మిమ్మల్ని మోసం చేసి దాని ఆకలి తీర్చుకుంటూ ఉంది అని చెప్పింది. ఇక దాంతో కుందేళ్లు అన్నీ నక్కకు  ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకున్నా యి. మరుసటి రోజు ఎప్పటిలాగే నక్క, కుందేలు తీసుకెళ్లడానికి వచ్చింది. అప్పుడు నక్క బావ..!  కాసేపు తాడు లాగే ఆట ఆడుకుందామా.. మేము అంతా ఒకవైపు ఉంటాము. నువ్వు ఒక్కడివి మరో వైపు ఉండాలి. ఎవరు గట్టిగా లాగితే వారే విజేతలు అని అన్నాయి కుందేళ్లు.

అందుకు నక్క ఓస్ ..! ఇంతేనా అని అంది. కుందేలు అన్ని ఒకవైపు, నక్క మరో వైపు తాడు ని పట్టుకొని బలంగా లాగడం మొదలు పెట్టాయి. నక్క బలంగా తాడుని లాగడం చూసిన కుందేళ్ళ అన్ని, కూడబలుక్కొని తాడును వదిలేశాయి. నక్క  ఒక్కసారిగా వెనకాల ఉన్న పెద్ద బావిలో పడిపోయింది. దాని పీడ విరగడ అయిందని, కుందేళ్లు  అన్నీ సంబరపడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: