మంచిమాట: పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు.. పేదవాడిగా చావడం మాత్రం నీ తప్పే
నేటి మంచిమాట.. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు.. పేదవాడిగా చావడం మాత్రం నీ తప్పే. అవును మనం పుట్టిన సమయంలో మనకు ఈ తల్లితండ్రి కావాలి.. ధనవంతులు కావాలి పేదవాళ్ళు వద్దు అనేది ఏమి ఉండదు. మనం ఎవరు ఒక తల్లి కడుపులో పుడుతం.. అమ్మ నాన్న అని పిలుస్తుం. అది పేద వాడు అయినా ధనవంతుడు అయినా.
అయితే పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు.. ఎందుకంటే దేవుడు నిన్ను పుట్టిస్తాడు. అలానే నువ్వు పుడుతావు. కానీ నువ్వు పేదవాడిగా చచ్చవు అంటే మాత్రం అది ఖచ్చితంగా నీ తప్పే అవుతుంది. ఎందుకంటే నువ్వే ఉండే విధానం.. నువ్వు కష్టపడే తాత్తవమే నువ్వు పేదవాడిగా ఉండాలా ? ధనవంతుడిగా ఉండాలి అనేది నిర్ణయిస్తుంది.
నువ్వు ఇప్పుడే చేసే పనే నిన్ను పేదవాడిగానో.. ధనవంతుడిగానో మారుస్తుంది. అలా కాదు అని నువ్వు పేదవాడిగా పుట్టినందుకు బాధపడుతూ ఉంటే ఇంకా నువ్వు ఎప్పుడు ధనవంతుడు అవుతావు. చెప్పులు కుట్టిన వారు కూడా రాజ్యాన్ని ఏలారు.. మనసు ఉంటె.. నీ ఆశలకు.. ఆశయాలకు పేదరికం ఎప్పుడు అడ్డుకాదు.