ఏపీ రాజధాని ప్లాన్ అద్దిరిపోయింది..

Chakravarthi Kalyan

ఎంతైనా సింగపూర్ అంటే సింగపూరే.. టైమంటే టైమే.. రూలంటే రూలే. ఔను మరి.. ఏపీ రాజధాని కోసం ప్లాన్ కావాలని చంద్రబాబు అడగ్గానే అక్కడి మంత్రులు, అధికారులు సీరియస్ గా దానిపై దృష్టిపెట్టారు. ఏప్రిల్ నాటికి గ్రాండ్ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తామన్నారు. అనుకున్నట్టే చేసేశారు.  

టూర్లో ఉన్న చంద్రబాబు


సింగపూర్ టూర్లో ఉన్న చంద్రబాబుకు అక్కడి మంత్రి ఈశ్వరన్ ఫస్ట్ ఫేస్ కేపిటల్ ప్లాన్ ఇచ్చేశారు. ఐతే ప్రస్తుతం ఇచ్చింది 7,068 ఎక‌రాల పూర్తి రాజధాని ప్రాంతం ప్లాన్ అన్నమాట. అంటే సీఆర్ డీఏ పరిధిలోని అన్ని ప్రాంతాలు దీనిలో వస్తాయి. 


కేపిటల్ సిటీ అంటే రాజధాని నగరం ప్లాన్ 


ఇది ఫస్ట్ ఫేజ్ ప్లాన్.. ఆ తర్వాత సెకండ్ ఫేజ్ లో కేపిటల్ సిటీ అంటే రాజధాని నగరం ప్లాన్ ఇస్తారట. దీని పరిధి దాదాపు 2500 ఎకరాలు ఉంటుందట. ఆ తర్వాత ధర్డ్ ఫేస్ లో కాపిటల్ సిటీ కోర్ ఏరియా ప్లాన్ ఇస్తారట. అంటే 10 కిలోమీటర్ల పరిధిలో రాజధానికి కావలసిన ప్రభుత్వ భవనాల ప్లాన్ అన్నమాట. 


అనేక శాటిలైట్ టౌన్స్


అన్నీ టైమ్ ప్రకారం అందిస్తామని ధీమాగా చెప్పిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్.. చంద్రబాబు చొరవపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచ స్థాయి న‌గ‌రం నిర్మించే అవ‌కాశం త‌మ‌కు ల‌భించింద‌న్నారు. ఏపీలో కొత్త రాజ‌ధాని న‌గ‌రంతో  పాటు, అనేక శాటిలైట్ టౌన్స్ ను కూడా నిర్మించ‌నున్నట్లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఎంట‌ర్‌ప్రైజ్ సింగ‌పూర్ సీఈఓ టియో యంగ్ చియాంగ్  తెలిపారు.    



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: