ఆర్టీసీ జేఏసీ భవిష్యతు ప్రణాళిక ఏంటి ...???

Sirini Sita
తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె ఈ రోజుతో 16వ రోజుకు చేరుకుంది. తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఉద్యోగులు డిమాండ్లని సీఎం కేసీఆర్ పట్టించుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి కొనసాగుతూ వస్తుంది. మొన్న హైకోర్టు కూడా కేసీఆర్ మరియు ఆర్టీసీ సంఘాలకు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఉద్దేశంతో పిలుపునిచ్చింది. గవర్నర్ సౌందరరాజన్ కూడా తెలంగాణ రవాణా శాఖ మంత్రి తో మాట్లాడారు, ఈ విషయంపై ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని త్వరగా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని  ఆమె మంత్రికి సూచించినట్లు విషయం మనకందరికీ తెలిసిందే.


 సోమవారం నుంచీ సమ్మె మరింత ఉద్ధృతమవుతుందని తెలిపారు. 23న ఉస్మానియా యూనివర్శిటీలో జరిగే బహిరంగ సభకు వెళ్తామన్న ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు... తాము ఊహించిన దానికంటే ఎక్కువగానే బంద్ విజయవంతం అయ్యిందని ప్రకటించారు. ఈరోజు ఆదివారం ఆర్టీసీ జేఏసీ ప్రణాళిక ఈ విధంగా ఉంటుందని  ఒక విధంగా తెలియజేశారు.ఆర్టీసీ ఉద్యోగులు ఆదివారం ప్రజలకు గులాబీలు ఇచ్చి... ఆర్టీసీ ప్రాముఖ్యత, అవసరాన్ని వివరిస్తారు.

అలాగే ఉదయం 11.30కి సుందరయ్య భవన్‌లో రాజకీయ జేఏసీ, ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు సమావేశం అవుతారు. ఇప్పటివరకూ సమ్మె ఎలా జరిగింది? ఇకపై ఎలా జరగాలి అన్నదానిపై చర్చిస్తారు. కొత్త కార్యాచరణ రెడీ చేసుకోనున్నారు. ఐతే... ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. కానీ ప్రభుత్వం నుంచీ అలాంటి సంకేతాలేవీ కనిపించట్లేదు. బంద్ సందర్భంగా... జరిగిన అరెస్టులు, రాసిన కేసుల్ని బట్టీ... ప్రభుత్వం కఠినంగానే ఉండాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది.


ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు ఇవ్వని ప్రభుత్వం... అద్దె బస్సులకు కూడా ఇవ్వాల్సిన అద్దె ఇవ్వలేదు. సెప్టెంబర్‌కి చెల్లించాల్సిన చెల్లింపులు చెల్లించలేదు. మా సంగతేంటని అద్దె బస్సుల యజమానులు అడుగుతున్నారు. సమ్మె వల్ల తమకు డబ్బులు ఆపేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీలో మొత్తం 10,460 బస్సులు ఉన్నాయి. వీటిలో అద్దె బస్సులు 2103 ఉన్నాయి. కొత్త బస్సులకు బదులు ప్రభుత్వం ప్రైవేట్ బస్సులకు అద్దె చెల్లిస్తూ నడిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: