వారు అట్రాక్ట్ అయినట్లయితే జగన్ గెలిచినట్టే..?

Pulgam Srinivas
రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక పార్టీ అధికారంలోకి రావాలి అంటే ఆ పార్టీ సైడ్ ఎక్కువ శాతం మంది జనాలు నిలబడాల్సి ఉంటుంది. అలా ఏ పార్టీ ని అయితే జనాలు నమ్మి ఎక్కువ శాతం ఓట్లు వేస్తారో వారే అధికారంలోకి వస్తారు. ఇకపోతే మే 13 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఇందులో తెలుగు దేశం , జనసేన , బీజేపీ కలిసి పోటీ చేయగా , ప్రస్తుత అధికార పార్టీ అయినటువంటి వైసీపీ మాత్రం ఒంటరి గానే పోటీలోకి దిగింది.

మూడు పార్టీలు పొత్తుగా పోటీ చేయడం , ఎక్కడ అయితే ఈ మూడు పార్టీలకు బలం ఎక్కువ ఉందో ఆ ప్రాంత సీట్లను ఏరి కోరి తీసుకోవడం ఇలా అనేక పరిణామాల వల్ల కూటమి సైడు ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది అని చాలా మంది అంచనా వేస్తూ వచ్చారు. ఇకపోతే ఎలక్షన్ల అనంతరం వైసీపీ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మేము పోయినసారి కంటే ఎక్కువ మెజారిటీ తెచ్చుకొని ఆంధ్ర రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రాబోతున్నాము అని చెప్పుకొచ్చాడు.

దీనితో జగన్ ఎలాంటి సమీకరణల ద్వారా ఇంత కాన్ఫిడెన్స్ గా ఎలక్షన్ల తర్వాత ఈ మాట చెప్పి ఉంటాడా అని అనేక మంది విశ్లేషించడం మొదలు పెట్టారు. ఇకపోతే ఆ విశ్లేషణ ప్రకారం చూసినట్లు అయితే వైసీపీ ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలను వారు అధికారంలోకి వచ్చాక తీసుకువచ్చారు. వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం చాలా వరకు సక్సెస్ అయ్యింది. అలాగే పెన్షన్ల కోసం ఇది.వరకు చాలా దూరం వెళ్లవలసి వచ్చేది.

అలాంటి అవసరం లేకుండా మరియు మరికొన్ని ఇతర అవసరాల కోసం కూడా జనాలు బయటికి వెళ్లకుండా వాలంటీర్ సిస్టమ్ ను తీసుకువచ్చి అన్ని పనులను వారి దగ్గరికి తీసుకువచ్చాడు. అలాగే మరికొన్ని సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు ఇవ్వడంతో వారంతా గంపగుత్తగా వైసీపీ కి ఓటు వేశారు.

అని దానితో మళ్ళీ వైసీపీని  అధికారంలోకి రాబోతుంది అని జగన్ అంచనా వేసుకుంటాడు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఒక వేళ నిజంగానే వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారంతా ఆ పార్టీ కే ఓటు వేసినట్లు అయితే జగన్ ప్రభుత్వం గెలిచే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: