కూటమి పవర్ లోకి వస్తే ఆ ప్రాంతం అభివృద్ధిలో పరుగులు పెట్టనుందా..?

Pulgam Srinivas
తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ఒంటరిగా పోటీలోకి దిగగా , తెలుగు దేశం , జనసేన , భారతీయ జనతా పార్టీ ఈ మూడు కలిసి పొత్తులో భాగంగా పోటీ చేశాయి. ఇక ఈ సారి ఎలక్షన్ లలో కాస్త ఓటింగ్ శాతం ఎక్కువ నమోదు కావడంతో అది మాకు పాజిటివ్ అంటే మాకు పాజిటివ్ అని రెండు ప్రధాన వర్గాలు చెబుతూ వస్తున్నాయి.

ఇకపోతే కూటమి అధికారం లోకి వస్తే ఓ రెండు జిల్లాలు భారీగా అభివృద్ధి చెందనునట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఆ రెండు జిల్లాలు ఏవో కాదు కృష్ణ , గుంటూరు. ఎందుకు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు దేశం పార్టీ అధికారం లోకి వచ్చింది.

అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకపోవడంతో కృష్ణ , గుంటూరు మధ్యలో చంద్రబాబు అమరావతి అనే నగరాన్ని రాజధానిగా ఎంపిక చేసుకున్నాడు. అందులో భాగంగా అనేక కట్టడాలను కూడా కట్టించాడు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దానితో మూడు రాజధానుల ప్రస్తావనను తీసుకువచ్చింది. దానితో కృష్ణ , గుంటూరు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ చాలా పడిపోయింది.

ఇక మళ్ళీ కనుక కూటమి అధికారం లోకి వస్తే అమరావతి చుట్టు పక్కలను బాబు చాలా డెవలప్ చేయాలని భావిస్తున్నట్లు , దానితో మళ్లీ కృష్ణ , గుంటూరు పరిసర ప్రాంతాల్లో భూములకు చాలా ధర పెరగనున్నట్లు దానితో రియల్ ఎస్టేట్ చేసే వారికి కూడా ఈ ప్రాంతం నుండి భారీ లాభాలు రాబోతున్నట్లు చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. దానితో కూటమి గనక అధికారం లోకి వస్తే కృష్ణ , గుంటూరు జిల్లాలు భారీగా అభివృద్ధి చెందనున్నట్లు చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: