పవన్ నన్ను కూడా రీమేక్ కోసమే పిలిచారు..ఆ తర్వాత ఏం జరిగిందంటే..సుజిత్..!

MADDIBOINA AJAY KUMAR
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆయనకు ఉన్న స్టార్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు అనేక రీమిక్ సినిమాలలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈయన నటించిన ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు అయి ఉండడం విశేషం. ఇక పవన్ నటించిన ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు రీమేక్ లు కావడంతో పవన్ కూడా ఎక్కువ శాతం రీమేక్ మూవీ లను చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు.

దానితో ఈ మధ్య కాలంలో కూడా పవన్ హీరో గా రూపొందిన వకీల్ సాబ్ మూవీ హిందీ సినిమా అయినటువంటి పింక్ కి రీమేక్ గా రూపొందింది. ఇక కొన్ని రోజుల క్రితమే పవన్ "బ్రో" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ తమిళ సినిమా అయినటువంటి వినోదయ సీతం కు రీమేక్ గా రూపొందింది. ఇక ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా తమిళ సినిమా అయినటువంటి తేరి మూవీ కి రీమేక్ అని తెలుస్తుంది.

ఇలా వరుస రీమేక్ మూవీ లలో హీరో గా నటిస్తున్న పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు , ఓజీ అనే రెండు స్టేట్ మూవీ లలో హీరో గా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఓజి మూవీ దర్శకుడు సుజిత్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో భాగంగా సుజిత్ "ఓజి" మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.

తాజాగా సుజిత్ మాట్లాడుతూ ... పవన్ కళ్యాణ్ గారితో సినిమా అవకాశం వచ్చింది అని ఎంతో సంతోషపడ్డాను. ఇక ఆఫీసుకు వెళ్లేసరికి వారు ఒక రీమేక్ చేయమని చెప్పారు. కానీ నాకు రీమేక్ మూవీ చేయడం పెద్దగా ఇష్టం లేదు. అలా నేను ఆలోచనలో ఉన్న సమయంలో పవన్ గారు ఒక రోజు ఏమైనా కొత్త కథ ఉందా అని అడిగారు. వెంటనే "ఓజి" లైన్ చెప్పాను. దానికి ఆయన ఫిదా అయ్యి వెంటనే సినిమా ఓకే చేశారు అని సుజిత్ తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: