"మనమే" నైజాం హక్కులను దక్కించుకున్న క్రేజీ సంస్థ..?

Pulgam Srinivas
శర్వానంద్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా మనమే అనే సినిమా రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని జూన్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం రెండు రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమా విడుదల తేదీ అనౌన్స్ కాక ముందే ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క ప్రచారాలను మొదలు పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ ఇప్పటికే అనౌన్స్ కావడం , అది కూడా చాలా దగ్గరగా ఉండడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన థియేటర్ హక్కులను అమ్మి వేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క నైజాం థియేటర్ హక్కులను ఓ ప్రముఖ సంస్థకు అమ్మివేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క నైజాం థియేటర్ హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలలో ఒకటి అయినటువంటి మైత్రి డిస్ట్రిబ్యూషన్ సంస్థ దక్కించుకున్నట్లు , అందులో భాగంగా ఈ మూవీ ని నైజాం ఏరియాలో భారీ ఎత్తున విడుదల చేయడానికి ఇప్పటి నుండే సన్నాహాలను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

ఇకపోతే శర్వానంద్ ఆఖరుగా ఒకే ఒక జీవితం అనే సినిమాలో హీరో గా నటించి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక మనమే మూవీ తో ఈ నటుడు ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే జూన్ 7 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఈ మూవీ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: