లోకేష్ "మంగళగిరి" టార్గెట్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయినట్లేనా..?

Pulgam Srinivas
తెలుగు దేశం పార్టీ లో అత్యంత ముఖ్యమైన సభ్యులలో చంద్రబాబు నాయుడు కుమారుడు అయినటువంటి నారా లోకేష్ ఒకరు. ఇకపోతే ఈయన 2019 అసెంబ్లీ ఎన్నికలలో మంగళగిరి నుండి పోటీ లోకి దిగారు. ఈయన తెలుగు దేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు కుమారుడు కావడం తో ఈయన మంగళగిరి లో అవలీలగా గెలుపొందుతారు , భారీ మెజారిటీ కూడా వస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ అనుహ్యంగా ఈయన మంగళగిరి స్థానం నుండి ఓడిపోయారు. దానితో ఈయన ఈ ప్రాంతం వైపు కూడా తిరిగి చూడడు అని చాలా మంది భావించారు.

కానీ లోకేష్ అలా అస్సలు చేయలేదు. ఓడిన చోటే గెలిచి చూపించాలి అని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా 2019 లో ఓటమిపాలైన లోకేష్ ఆ తర్వాత నుండి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు మంగళ గిరి పై పూర్తి దృష్టి పెట్టాడు. ప్రతి విషయంపై ఎంతో అవగాహనను తెచ్చుకొని ఈ ప్రాంతం పై చాలా పట్టు పెంచుకున్నారు. ఇకపోతే 2024 అసెంబ్లీ ఎన్నికలలో కూడా లోకేష్ తాను పూర్వం ఓడిన మంగళగిరి స్థానం నుండే పోటీ చేశారు. ఇక పోయిన సారి ఓడిపోయిన ఈ సారి మాత్రం లోకేష్ ఇక్కడి నుండి ఓడిపోవడం అసంభవం అని తెలుస్తుంది.

ఇక ఇక్కడి గ్రామాల ప్రజలు ఈ సారి నారా లోకేష్ కు భారీ స్థాయిలో ఓటింగ్ జరిగింది అని , ఆయన గెలవడం పక్క అని ఎంత మెజారిటీ వస్తుంది అనేదే క్లారిటీ లేదు అని ఇక్కడ ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. మరి పోయిన సారి ఓడిపోవడంతో మంగళగిరి అసెంబ్లీ లో కచ్చితంగా గెలవాలి అని టార్గెట్ పెట్టుకున్న లోకేష్ దాదాపు ఈ సారి ఆ టార్గెట్ ను రీచ్ అయినట్లే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: