"గం గం గణేశా" నైజాం.. ఏపీ.. కర్ణాటక హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థలు..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు ఆనంద్ దేవరకొండ పోయిన సంవత్సరం బేబీ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ భారీ కలక్షన్ లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఒక్క సారిగా ఈ  నటుడి క్రేజ్ తెలుగు లో అమాంతం పెరిగి పోయింది. ఇకపోతే తాజాగా ఈ నటుడు గం గం గణేశా అనే కామెడీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ని మే 31 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.
 

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్   లభించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో మరో ఒకటి రెండు రోజుల్లో ఈ మూవీ కి సంబంధించిన ప్రి రిలీజ్ ఈవెంట్ ను కూడా మేకర్స్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.

ఆ ఈవెంట్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి రష్మిక మందన ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమా యొక్క ప్రపంచ వ్యాప్త థియేటర్ హక్కులను ఈ మూవీ బృందం అమ్మి వేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ యొక్క నైజాం మరియు ఆంధ్రప్రదేశ్ , కర్ణాటక థియేటర్ హక్కులను అమ్మి వేసింది.

అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది. ఇక అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమా యొక్క నైజాం థియేటర్ హక్కులను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP సంస్థ వారు సంస్థ వారు దక్కించుకోగా , ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక థియేటర్ హక్కులను ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ సంస్థ వారు దక్కించుకున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలువడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: