ఫియర్ సాంగ్ టోటల్ వ్యూస్ ఇవే.. ఏ భాషలో ఎంతో తెలుసా..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ తోనే ఈ ముద్దు గుమ్మ తెలుగు తెరకు పరిచయం కానుంది. ఇక హిందీ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటలలో ఒకరు అయినటువంటి సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో కనిపిస్తూ ఉండగా ... ప్రస్తుతం ఇండియాలో అత్యంత క్రేజ్ కలిగిన సంగీత దర్శకులను ఒకరు అయినటువంటి అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

ఈ మూవీ ని మొత్తం రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు , అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఎన్టీఆర్ పుట్టిన రోజు అయినటువంటి మే 20 వ తేదీ కంటే ఒక రోజు ముందు అనగా మే 19 వ తేదీన ఈ సినిమా నుండి ఫియర్ అంటూ సాగే సాంగ్ ను తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ఒకే సారి విడుదల చేశారు. ఈ సాంగ్ కి ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది.

ఇకపోతే ఈ సాంగ్ కి ఏ భాషలో ఎన్ని వ్యూస్ ఇప్పటి వరకు లభించాయి. మొత్తంగా ఎన్ని వ్యూస్ ను ఈ సాంగ్ తెచ్చుకుంది అనే వివరాలను తెలుసుకుందాం. ఈ సాంగ్ తెలుగు వర్షన్ కి ఇప్పటి వరకు 32.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ సాంగ్ హిందీ వర్షన్ కు 18.9 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తమిళ్ వెర్షన్ కి 6 మిలియన్ వ్యూస్ రాగా , కన్నడ వర్షన్ కి 3.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. మలయాళ వెర్షన్ కి 2 మిలియన్ న్యూస్ వచ్చాయి. మొత్తంగా ఈ సాంగ్ కి 5 భాషల్లో కలిపి 62.6 మిలియన్ వ్యూస్  యూట్యూబ్ లో వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: