తుపాను దిశను శాటెలైట్స్ తో మాట్లాడి చెపుతారు చంద్రబాబు - నేరగాళ్ళ అంతుచూస్తారు ఏబివి

మనం చెప్పుకున్న బడాయిలు, స్వయం కృతంగా చేసిన నేఱాలు మనల్ని భవిష్యత్ లో వెంటాడతాయన్న ఙ్జానం జిఙ్జాస ముందుగానే కలిగి ఉండటం రాజకీయ నాయకులకు అత్యవసరం. అలా కాకుండా మా ప్రభుత్వం ప్రకృతిని శాసించిందనో నియంత్రించిందనో ప్రగల్బాలు పలికినవారు ఆ తరవాత కాలంలో అభాసు పాలు కాకతప్పదు. దానికి ఉదాహరణే విజయ సాయి వ్యాఖ్యలు. సింపుల్ గా తమ పని తాము చేసి అవసరమైన చోట్ల వివరణలు హుందాగా ఇచ్చే వాళ్ళకు ఈ అవమానాలు ఉండవు.  

వాతావరణ శాస్త్రవేత్తలు "ఫణి" తుఫాను గమనదిశను తెలుసుకోవాలంటే ఉపగ్రహాలతో నేరుగా సంభాషించే ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సలహా తీసుకో వాలని వైసీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి సూచించారు. "వాతావరణ శాస్త్రవేత్తలు ఫణి తుఫాను గమన దిశను తెలుసుకోవాలంటే శాటిలైట్లతో నేరుగా సంభాషించ గలిగే చంద్రబాబు సలహా తీసుకోవాలి. ఈయన యాంటెన్నాలు - రాడార్ల కంటే బలమైన సిగ్నల్స్ తో పనిచేస్తాయి. "తిత్లీ" తుపాను సమయంలో ఐఎండి వాళ్లకు తనే తీరం దాటే ప్రదేశాన్ని యాక్యురేట్ గా చెప్పినట్టు డప్పు కొట్టుకున్నాడు’ అని ఎద్దేవా చేశారు.

"అవినీతి తిమింగలాలను వదిలేదిలేదని పట్టేస్తానని అవినీతి నిరోధక శాఖ అధినేతగా పోస్టింగ్స్ తీసుకున్న ఏబీ వెంకటేశ్వరరావు అంటుంటే ‘హతోస్మి’ అనుకున్నా.
చంద్రబాబు కోసం ఫోన్‌ ట్యాపింగులు, ఎమ్మెల్యేల కొనుగోళ్లు మొదలు అడ్డమైన అన్ని పనులూ చేసిన ఈయన, తన అవినీతి మీద విచారణ ఎదుర్కొనే స్థితిలో ఉన్నారా? లేక ఇతరుల అవినీతి మీద విచారణ చేసే స్థితిలో ఉన్నారా?’ అని ప్రశ్నించారు. శనివారం ఆయన ట్విటర్‌ వేదికగా అటు చంద్రబాబు, ఇటు ఏసీబీ కొత్త డీజీ ఏబీ వెంకటేశ్వరరావుపై వ్యంగ్యస్త్రాలు సంధించారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: