కుమారుడికి ఓట్లేయకపోతే అంతు చూస్తానంటున్న జేసీ ?
ఇదే క్రమంలో అనంతపురం జిల్లా రాజకీయాలలో కీలకంగా ఉండే జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్ కుమార్ మొట్టమొదటిసారి ప్రజాక్షేత్రంలో పోటీకి దిగిన నేపథ్యంలో తండ్రి జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం జిల్లాలో ఉన్న గ్రామాలలో ప్రజలకు తన కుమారుడికి ఓటు వేయకపోతే మీ అంతు చూస్తాను అంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు. దీంతో జేసి దివాకర్ రెడ్డి వ్యవహరిస్తున్న శైలిపై అనంతపురం జిల్లాలో ఉన్న గ్రామస్తులు మండిపడుతున్నారు.
ఓటు కూడా ఎవరికి వేయాలో మీరే చెబుతారా అంటూ తెలుగుదేశం పార్టీ నాయకుల వ్యవహారశైలిపై మండిపడుతున్నారు. మరోపక్క జేసీ దివాకర్ రెడ్డి తన కుమారుడు పవన్ ఎలాగైనా మొట్టమొదటిసారి గెలిపించుకోవాలని తెగ ఆరాటపడుతున్నారు. మొత్తంమీద ఎన్నికల ముందు రోజు జెసి దివాకర్ రెడ్డి అనంతపురం జిల్లా గ్రామాల లో హల్ చల్ చేయడంతో ఈ వార్త ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ అయింది.