మీరెన్నడూ చూడని అలీ : బాధ గుండెల్లో - నిజాయితీ మాటల్లో.. అల్లా సాక్షిగా !

Chakravarthi Kalyan
నటుడు అలీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటే.. నన్ను నమ్మించి మోసం చేశాడని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ మాటల యుద్ధానికి దారి తీస్తున్నాయి. పవన్ కల్యాణ్ మాటలతో ఆవేదన చెందిన అలీ.. పవన్ మాటలకు వీడియోల ద్వారా బదులిచ్చారు. 


ఎప్పుడూ నవ్వుతూ.. నవ్వించే నటుడు అలీ.. ఈ వీడియోల్లో చాలా బాధగా కనిపించారు. ఆయన ముఖం చూస్తేనే.. గుండల్లో ఎంత బాధపడుతున్నారో అర్థం అవుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో స్పందించాల్సి వచ్చిందన్న ఆవేదన ఆయన ముఖంలో మాటల్లో కనిపించింది. 

ఇన్నాళ్ల స్నేహాన్ని మీరు అర్థం చేసుకున్నది ఇంతేనా పవన్ కల్యాణ్‌ గారూ.. అన్న ప్రశ్న.. ఆయన నోటి నుంచి కాదు.. కళ్ల నుంచి వచ్చింది. ఆయన స్పందనలో పవన్ కల్యాణ్‌ను అవమానించే ఉద్దేశం ఈషణ్మాత్రమూ కనిపించలేదు. పవన్‌ కు గౌరవం ఇస్తూనే.. సుటిగా నిలదీశారు..

చాలా చిన్న స్వరంతో.. మెల్లగా బాధతో మాట్లాడిన అలీ మాటలు.. ఒక్కొక్కటి ఈటెల్లా పవన్‌ కు తగలడం ఖాయంగా కనిపిస్తోంది.. తాను ఎంత గౌరవం ఇచ్చిందీ.. అందుకు పవన్ కల్యాణ్ ఎంత చిల్లరగా స్పందించిందీ.. అలీ మాటలు చూస్తే సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా అలీ స్పందన ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: