ఈ అభ్యర్థుల వద్ద కోట్లలో ధనం.. వీళ్లకు అంత సంపద ఎలా ఉందంటే

Suma Kallamadi
ఏపీ, తెలంగాణలో ఎంపీ అభ్యర్థులకు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జరుగుతోంది. పార్లమెంటు ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు ఎంపీ అభ్యర్థులు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. వారిలో ఒకరు డాక్టర్ కాగా, మరొకరు ఇంజినీర్. ఏపీలో టీడీపీ తరుపును గుంటూరు లోక్‌సభ స్థానానికి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. ఆయన వృత్తి రీత్యా డాక్టర్. అయితే ఆయన ఎన్నో వ్యాపారాలతో భారీగా ఆస్తులు సంపాదించారు. ఇటీవల ఆయన దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన మొత్తం ఆస్తుల విలువ 5,785.28 కోట్లు. చంద్రశేఖర్ ఇప్పటివరకు దేశంలోని అత్యంత సంపన్న ఎన్నికల అభ్యర్థులలో ఒకరు. చరాస్తుల పరంగా, డాక్టర్ చంద్రశేఖర్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, టర్మ్ డిపాజిట్లు, ఇతర పెట్టుబడులతో సహా రూ. 2,316 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నారు. కాగా ఆయన భార్య కోనేరు శ్రీరత్న రూ.2,289 కోట్ల విలువైన చరాస్తులను కలిగి ఉన్నారు. ఇంకా దంపతుల స్థిరాస్తులు డాక్టర్ చంద్రశేఖర్‌కు రూ.72,00,24,245 కాగా, శ్రీరత్నకు రూ.34,82,22,507 డబ్బులు కలిగి ఉన్నారు.
తెలంగాణలోని చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నిలిపింది. 2009లో డీలిమిటేషన్ తర్వాత చేవెళ్ల ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బీజేపీ ఈ స్థానాన్ని గెలుచుకోలేకపోయింది. ఈయన తన అఫిడవిట్‌లో సమర్పించిన భారీ ఆస్తులతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి 2019లో తన ఆస్తుల విలువ రూ.895 కోట్లుగా ప్రకటించారు. ఈసారి ఆయన సంపద రూ.1,240 కోట్లకు పెరిగిందని, ఆయన కుటుంబం మొత్తం సంపద రూ.4,568 కోట్లుగా ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు.  అఫిడవిట్‌ ప్రకారం కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఆయన భార్య సంగీతారెడ్డి, కుమారుడు కె. వైరా మాధవరెడ్డికి మొత్తం రూ.4,568 కోట్ల విలువైన చర, స్థిరాస్తులు ఉన్నాయి. చరాస్తులలో ఎక్కువ భాగం అపోలో హాస్పిటల్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ షేర్లలో ఉన్నాయి. కొండా విశ్వేశ్వర రెడ్డికి రూ.973.22 కోట్ల షేర్లు ఉండగా, ఆయన భార్యకు రూ.1,500.85 కోట్ల షేర్లు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: