తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో
అల్లరి నరేష్ ఒకరు. ఈయన తన కెరియర్ ప్రారంభంలో వరసగా
కామెడీ ప్రాధాన్యత ఎక్కువ ఉన్న సినిమాలలో నటించి
ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక సుడిగాడు
మూవీ తో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న ఈయనకు ఆ తర్వాత ఏ
కామెడీ సినిమా ద్వారా కూడా మంచి విజయం దక్కలేదు.
చాలా సంవత్సరాల పాటు వరస అపజయాలను ఎదుర్కొన్న ఈ నటుడు నాంది అనే సినిమాతో మంచి విజయం అందుకొని మళ్ళీ కం బ్యాక్ ఇచ్చాడు. కొంతకాలం క్రితం ఈయన
నాగార్జున హీరోగా రూపొందిన నా సామి రంగ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ
మూవీ మంచి విజయం అందుకుంది. అలాగే ఇందులో
నరేష్ నటనకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి.
నరేష్ తాజాగా ఆ ఒకటి అడక్కు అనే సినిమాలో హీరోగా నటించాడు. మళ్లీ అంకం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా
హీరోయిన్ గా నటించింది. మే 3 వ తేదీన ఈ
సినిమా విడుదల కానుంది. ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం
నరేష్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో
అల్లరి నరేష్ మాట్లాడుతూ ఓ సీనియర్ స్టార్ హీరోతో
సినిమా చేయాలని ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.
తాజాగా ఇంటర్వ్యూలో భాగంగా
నరేష్ మాట్లాడుతూ ... తెలుగు సినీ పరిశ్రమలో
వెంకటేష్ గారి నటన అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా ఆయన
కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. ఆయనతో కలిసి ఓ
కామెడీ సినిమా చేయాలని ఉంది అని
అల్లరి నరేష్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే
అల్లరి నరేష్ ఇప్పటికే మహేష్ ,
నాగార్జున లాంటి స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు.