ఏపీ: శిష్యుడి దగ్గర పాఠాలు నేర్చుకుంటున్న చంద్రబాబు..ప్లాన్ ఫలిస్తుందా..?

Pandrala Sravanthi
 కాంగ్రెస్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఎక్కువ రాజకీయ చతురత కలిగిన పార్టీ టిడిపి అని చెప్పవచ్చు. ఎంతోమంది నాయకులు ఓనమాలు నేర్చుకొని రాష్ట్ర సీఎంలుగా కూడా ఎదిగారు. అలాంటి వారిలో  కేసీఆర్,  రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇద్దరు నేతలు చంద్రబాబు వద్ద శిష్యులే.  అయితే అలాంటి సీనియర్ నేత చంద్రబాబు ఒకప్పుడు శిష్యులకు ఎన్నో రాజకీయ ఓనమాలు నేర్పాడు. ప్రస్తుతం ఆయన ఆ శిష్యుల నుంచే వ్యూహాలు నేర్చుకుంటున్నాడు. అంటే గురువు గారే శిష్యులకు శిష్యుడయ్యాడని అర్థం. అది ఎలాగా అంటే..ప్రస్తుతం శిష్యుడు మేనిఫెస్టోని గురువుగారు కాపీ కొట్టారు. ఇదే కాకుండా శిష్యుడు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కుయుక్తులు పన్నాడో గురువు చంద్రబాబు కూడా అదే బాటలో ప్రయాణిస్తూ సక్సెస్ అవ్వాలని చూస్తున్నాడు. 

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉచిత బస్సు అనే పథకం ప్రజల్లోకి చాలా వెళ్ళిపోతుంది. అంతే కాకుండా మహిళలకు 1500,  అలాగే కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందే మౌత్ పబ్లిసిటీ అనే స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ ఎలక్షన్స్ కు ముందు తెలంగాణ లో పాటించిన వ్యూహాలే. వీటన్నింటిని తన గురువుగారైన చంద్రబాబు కూడా  ఏపీలో ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి బిజెపి వర్సెస్ బీఆర్ఎస్ అనే పదం నుంచి  కొత్త కొత్త పథకాలు తీసుకువచ్చి మౌత్ టాక్ ద్వారా  అధికారంలోకి వచ్చేసారు. ఆ విధంగానే చంద్రబాబు కూడా  ఉచిత బస్సు మౌత్ టాక్, మహిళలకు 1500 రూపాయలు అనే పథకాలపై ఆశ పెట్టుకున్నారు. ముఖ్యంగా తెలంగాణలో మౌత్ టాక్ ద్వారా కేసిఆర్ మూటముల్లె సర్దుకోవాల్సిందే అనే నినాదాన్ని తీసుకొచ్చారు. కేసీఆర్ పని అయిపోయింది అంటూ పూర్తిగా ఆయనను లేకుండా చేసేశారు.

 ఆ విధంగానే చంద్రబాబు కూడా వైసిపి మానియా తగ్గుతుంది, తగ్గుతుంది అంటూ టిడిపి వైపు నాయకులందరినీ మళ్ళించేలా చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే తెలంగాణలో ధరణి అనే   పోర్టల్ ను పట్టుకొని రేవంత్ రెడ్డి రాజకీయం చేసి అధికారంలోకి వచ్చాడు. అయితే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ల్యాండ్ టేకింగ్ యాక్ట్ అనే పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పవచ్చు. ఈ విధంగా ప్రజల్లోకి కొత్త కొత్త టాపిక్ లు తీసుకువచ్చి  టిడిపి వైపు ప్రజలు మళ్లేలా చేయడంలో సఫలం అవుతున్నారని చెప్పవచ్చు.  ఓవరాల్ గా రేవంత్ రెడ్డి కేసీఆర్ నుంచి ట్రెండును రేవంత్ రెడ్డి వైపు మార్చుకున్నారు.  ఆ విధంగానే చంద్రబాబు కూడా ట్రెండును వైసీపీ నుంచి టీడీపీకి మార్చే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: