ఏ మాత్రం తగ్గని నారి నారి నడుమ మురారి.. అక్కడ కూడా రెచ్చిపోతుంది..?

Pulgam Srinivas
ఏ మాత్రం తగ్గని నారి నారి నడుమ మురారి.. అక్కడ కూడా రెచ్చిపోతుంది..!

గత కొంత  కాలంగా వరుస అపజయాలటీ డీలా పడిపోయిన శర్వానంద్ తాజాగా నారి నారి నడుమ మురారి అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. సాక్షి వైద్య  , సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ కి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఈ  చిత్రాన్ని ఈ  సంక్రాంతి కానుకగా జనవరి 15 వ తేదీన విడుదల చేసారు. ఈ  మూవీ కి సంబందించిన ప్రీమియర్ షో లను  జనవరి 14 వ తేదీ సాయంత్రం నుండి ప్రదర్శించారు.


ఈ  మూవీ కి ప్రీమియర్ షో ల ద్వారానే సూపర్ టాక్ రావడంతో ఈ మూవీ ఈ సంక్రాంతికి అన్ని సినిమాల కంటే లేటుగా విడుదల అయ్యి  , తక్కువ థియేటర్స్ ను దక్కించుకున్న కూడా సూపర్ కలెక్షన్స్ ను రాబట్టి అద్భుతమైన లాభాలను అందుకొని బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. 


బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ  మూవీ  తాజాగా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్లో రెచ్చి పోయిందో ఓ టీ టీ లో కూడా అదే రేంజ్ దూకుడును చూపిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో టాప్ ట్రెండింగ్లో కొనసాగుతుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. లా నారి నారి నడుమ మురారి మూవీ కేవలం బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రమే కాకుండా ఓ టీ టీ  ఫ్లాట్ ఫామ్ లో  కూడా సూపర్ గా రెస్పాన్స్ ను దక్కించుకుంటూ   దూసుకు పోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: