అవ్వాతాతల ఉసురు పోసుకుంటున్న బాబు.. పింఛన్ డబ్బుల కోసం ఇన్ని ఇబ్బందులా?

Reddy P Rajasekhar
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని అవ్వాతాతల ఉసురు పోసుకుంటున్నారా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్,
 టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదుల వల్ల అవ్వాతాతలు బ్యాంక్ క్యూలైన్లలో గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. 70, 80 సంవత్సరాల వయస్సు ఉన్న తాము నిలబడటమే కష్టమని బ్యాంక్ క్యూ లైన్లలో ఎలా నిలబడాలని వృద్ధులు ప్రశ్నిస్తున్నారు.
 
అవ్వాతాతలతో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కిటకిటలాడుతున్నాయి. విత్ డ్రా ఫామ్స్ ఫిల్ చేయడం తెలియక, సంతకం మ్యాచ్ కాక కొంతమంది వృద్ధులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. మరికొన్ని ప్రాంతాలలో బ్యాంక్ సిబ్బంది ఏటీఎం కార్డ్ ఉన్న వృద్ధులు అక్కడే తీసుకోవాలని రూల్స్ చెబుతున్నారు. తమకు ఎదురవుతున్న ఈ కష్టాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా చంద్రబాబు కారణమని చెబుతూ వృద్ధులు కలత చెందుతున్నారు.

చంద్రబాబు నిన్ను ఈ పాపం ఊరికే వదలదు అంటూ కొందరు వృద్ధులు బాబుకు శాపాలు పెడుతున్న వీడియోలు సైతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాము నివశించే ప్రాంతం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో బ్యాంక్ ఉందని అక్కడికి వెళ్లి డబ్బులు విత్ డ్రా చేసుకునే విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొంతమంది వృద్ధులు కామెంట్లు చేస్తున్నారు.
 
అవ్వాతాతలను ఇంతలా మనోవేదనకు గురి చేసిన నేత చంద్రబాబేనని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని కొందరు వృద్ధులు వాపోతున్నారు. వాలంటీర్లు ఒకటో తేదీ వస్తే ఉదయాన్నే పింఛన్ ఇచ్చేవారని బాబు వల్ల ఇప్పుడు రోజంతా పింఛన్ కోసం పడగాపులు కాయాల్సి వస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సర్వర్ పని చేయకపోవడం వల్ల కొన్నిచోట్ల వృద్ధులు బ్యాంకులకు వెళ్లి వెనుదిరగాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. జగన్ మళ్లీ సీఎం అయితే మాత్రమే ఈ పరిస్థితులు మారతాయని కొందరు వృద్ధులు కామెంట్లు చేస్తున్నారు. అవ్వాతాతలను ఇంతలా మానసిక వేదనకు గురి చేసిన నేత చంద్రబాబు తప్ప మరెవరూ లేరని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్యూ లైన్ లో నిలబడి సర్వర్ పని చేయక వెనుదిరగాల్సిన పరిస్థితి రావడంతో వృద్ధులు కన్నీటి పర్యంతమవుతున్నారు. బ్యాంక్ సిబ్బంది రేపు రండి అని చెబుతుండటంతో రేపు సర్వర్ పని చేయకపోతే పరిస్థితి ఏంటని చంద్రబాబే ఈ పరిస్థితికి కారణమని వృద్ధులు కామెంట్లు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: