లోక‌ల్ టాక్ : అంబ‌టి గెలుస్తాడా.. కౌంటింగ్‌కు ముందే క్లారిటీ..?

RAMAKRISHNA S.S.
- అంబ‌టి ఆవేద‌నే ఆయ‌న ఓట‌మిని చెప్పేస్తోందా ?
- జ‌ల‌వ‌న‌రుల మంత్రి ఓట‌మి సెంటిమెంట్ రిపీట్ ?
- ఎన్నిక‌ల వేళ సొంత అల్లుడు వీడియో, పోలీసుల కోప‌రేష‌న్ లేక‌పోవ‌డం మైన‌స్సే
( ప‌ల్నాడు - ఇండియా హెరాల్డ్ )
వైసీపీ నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్ నేత అంబ‌టి రాంబాబు ఆవేద‌న అంతా ఇంతాకాదు. పోలీసులు ఏక‌ప‌క్షం గా వ్య‌వ‌హ‌రించార‌ని.. త‌న‌ను క‌నీసం ల‌క్ష్యం కూడా పెట్ట‌లేద‌ని.. ఆయ‌న ఆవేద‌న చెందుతున్నారు. కానీ,  అస‌లు ఆవేద‌న వేరే ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. అదే.. సొంతం అనుకున్న నాయ‌కులు కూడా.. సొంత కాకుండా పోవ‌డ‌మ‌. ఆయ‌న‌కు అనుకూలంగా పోటెత్తి ఓటేస్తార‌ని భావించిన వ‌ర్గాలు కూడా.. ఆయ‌న‌కు దూరంగా జ‌ర‌గ‌డ‌మే ఆవేద‌న‌కు అస‌లు కార‌ణంగా క‌నిపిస్తోంది.

టీడీపీ నుంచి బ‌రిలో ఉన్న సీనియ‌ర్‌నాయ‌కుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను అంబ‌టి ఆది నుంచి కూడా త‌క్కువ‌గా అంచ‌నా వేశారు. కానీ, క‌న్నాకు తోడుగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌నిలిచారు. దీంతో ఇక్క‌డ ప‌రిస్థితి యూట‌ర్న్‌తీసుకుంది. వైసీపీ ఓడిపోయే నియోజ‌క‌వ‌ర్గాల్లో న‌గ‌రి త‌ర్వాత‌.. స్థానం స‌త్తెన‌పల్లేన‌న్న ఎన్నిక‌ల‌కు ముందున్న అంచ‌నా నిజ‌మ‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంద‌న్న‌ది అంబ‌టి ఆవేద‌న‌కు అస‌లు కార‌ణంగా క‌నిపిస్తోంది.

చిత్రం ఏంటంటే.. 2014 నుంచి చూసుకుంటే..జ‌ల‌వ‌న‌రుల మంత్రులుగా ప‌నిచేసిన నాయ‌కులు ఓట‌మి పాల‌వ‌డం. 2014లో టీడీపీ త‌ర‌ఫున విజ‌యం దక్కించుకున్న దేవినేని ఉమా.. జ‌ల‌వ‌న‌రుల మంత్రిగా చేశారు. 2019లో ప‌రాజ‌యం పాల‌య్యారు. ఆ త‌ర్వాత‌.. వైసీపీ హ‌యాంలో అనిల్‌కుమార్ యాద‌వ్ జ‌ల‌వ న‌రుల మంత్రిగా ప‌నిచేశారు. ఆయ‌న‌కు అసెంబ్లీ టికెట్ ద‌క్క‌లేదు.పైగా త‌న‌కు సంబంధం లేద‌ని న‌ర‌స‌రావుపేట నుంచి బ‌రిలో నిల‌వాల్సి వ‌చ్చింది. ఇక్క‌డ ఆయ‌న ప‌రిస్థితి ఎదురీత‌గానే ఉంది.

ఈ నేప‌థ్యంలో జ‌ల‌వ‌న‌రుల మంత్రిగా ఉన్న అంబ‌టికి కూడా ఈ సెంటిమెంటే వెంటాడుతుండ‌డం మ‌రో కార‌ణంగా ఆయ‌న ఆవేద‌న‌కు క‌నిపిస్తోంది. ఇవ‌న్నీ ఇలా.. ఉంటే.. ఎన్నిక‌ల వేళ సొంత అల్లుడు మీడియా ముందుకు రావ‌డం.. సెల్ఫీ వీడియోల‌తో ఉక్కిరి బిక్కిరికి గురిచేయ‌డం కూడా.. అంబ‌టికి నిద్ర పోకుండా చేసింది. వెర‌సి ఆయ‌న ఆవేద‌న‌కు పోలీసులు స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం క‌న్నా.. రాజ‌కీయ వ్యూహాలు వేయ‌లేక పోవ‌డ‌మే కార‌ణంగా క‌నిపిస్తోంద‌ని స్తానికులు చెబుతున్న మాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: