జుట్టు రాలిపోతుందని చాలా మంది బాధ పడుతూ ఉంటారు. ఎన్నిషాంపూలు వాడినా చుండ్రు తగ్గడం లేదని నిరాశ చెందుతూ ఉంటారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో దాదాపు అందరూ ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. ఇక, ముఖంపై మొటిమల సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, వీటన్నింటికీ కూడా పరిష్కారం ఖరీదైన షాంపూలు, క్రీముల్లో కాదు.. మన పూర్వికులు వాడిన కుంకుడుకాయల్లో ఉందంటోంది మన ఆయుర్వేదం. మరి వాటితోనే తలస్నానం చేసి చూస్తే ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది. ఆ ఫలితం కొద్ది రోజుల్లోనే మీకే కనిపిస్తుంది. కుంకుడు కాయల్లో ఉండే యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ గుణాల వల్ల చుండ్రు సమస్య ఈజీగా తగ్గుతుంది. జుట్టు బాగా ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. అయితే, దీన్ని నేరుగా వాడే బదులు, కాసిని మందార ఆకుల్ని కలిపి శుభ్రంగా తలస్నానం చేయండి. ఇలా మీరు కనీసం నాలుగైదు వారాలు చేసి చూడండి. ఖచ్చితంగా ఫలితం మీకే తెలుస్తుంది.కుంకుడుకాయలకు యాంటీ అలర్జీ, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలనేవి ఎక్కువ. అందుకే దీన్నీ చర్మానికి క్లెన్సర్‌గా కూడా వాడొచ్చు. మొటిమలూ, వాటి తాలూకు మచ్చలూ కూడా చాలా ఈజీగా దూరమవుతాయి.
ఇందుకోసం కుంకుడు రసంలో ముంచిన దూదితో ముఖాన్ని బాగా శుభ్రం చేస్తే చాలు. క్రమంగా మీ సమస్య ఈజీగా దూరమవుతుంది. అలాగే కాలుష్యం, ఇతరత్రా సమస్యలు… ఈ రోజుల్లో జుట్టు రాలడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఈ ఇబ్బందికి చెక్ పెట్టడానికి కుంకుడు రసం చక్కటి పరిష్కారం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాటిని రెండు మూడు గంటల ముందు నానబెట్టి రసం తీసి, దీనికి పావు కప్పు కలబంద గుజ్జు కలిపి మీ తలకు రాయాలి. ఆపై ఐదు నిమిషాలాగి రుద్ది తలస్నానం చేస్తే మాడు నుంచి చివర్ల దాకా పట్టిన మురికితో పాటు రసాయనాల తాలూకు ప్రభావం కూడా ఈజీగా వదిలిపోతుందట. అలాగే చాలామంది కూడా ముఖంపై చూపిన శ్రద్ధ పాదాలపై చూపించరు. దీనివల్ల అవి ఎంతో కాంతివిహీనంగా కనిపిస్తాయి. గోళ్లు, మడమలు చాలా మురికిగా మారతాయి.అందుకే వీటిని శుభ్రం చేయడానికి కుంకుడు రసంలో కాస్త గులాబీనీరు చేర్చి ఓ పదినిమిషాలు నానబెట్టండి. ఆ తరువాత కొబ్బరి పీచుని తీసుకుని మృదువుగా రుద్దండి. అప్పుడు టాన్, డెడ్‌స్కిన్ వదిలిపోయి.. పాదాలు ఎంతో కోమలంగా మారతాయి.