ఓటిటిలోనాలుగు భాషల్లో హల్చల్ చేయబోతున్న హర్రర్ మూవీ..!!

murali krishna
హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ఈ చిత్రాలకు మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. ఇక హారర్ సినిమాలకు కాస్తా కామెడీ టచ్ ఇచ్చి పక్కాగా తెరకెక్కిస్తే వచ్చే రిజల్టే వేరు.అలా కొన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయితే మరికొన్ని చతికిలపడిన దాఖలాలు ఉన్నాయి. అయితే, ఇటీవల ఓ ద్విభాష హారర్ కామెడీ మూవీ ఓటీటీలోకి వచ్చేయనుంది. అదే అరణ్మనై 4 సినిమా.ఓటీటీలోకి మరికొన్ని రోజుల్లో ఈ భయపెట్టే బ్లాక్ బస్టర్ హారర్ చిత్రం అరణ్మనై 4 రానుంది. దీన్ని తెలుగులో బాక్ అనే టైటిల్‌తో విడుదల చేశారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ నుంచి ట్రైలర్ వరకు ప్రతిది ఆకట్టుకుంది. దాంతో అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగినట్లే అరణ్మనై 4 మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సత్తా చాటింది.ఈ సినిమాలో మిల్కీ భామ తమన్న, బొద్దుగుమ్మ రాశీ ఖన్నా  మరోసారి కలిసి నటించారు. వీరిద్దరు ఇంతకుముందు రవితేజ బెంగాల్ టైగర్ సినిమాలో హీరోయన్స్‌గా చేశారు. ఇప్పుడు అత్యంత విజయవంతమైన హార్రర్ కామెడీ అరణ్మనై ఫ్రాంచైజీ నుంచి నాలుగో సినిమాగా వచ్చిన అరణ్మనై 4లో గ్లామర్‌తో అదరగొట్టడమే కాకుండా భయపెట్టారు.అరణ్మనై 4ను కూడా గత చిత్రాలకు దర్శకత్వం వహించిన నటుడు, డైరెక్టర్ సుందర్ సి  తెరకెక్కించారు. అయితే, ఈ సినిమాను తెలుగులో బాక్  పేరుతో విడుదల చేశారు. తమిళంతోపాటు తెలుగులో కూడా అరణ్మనై సిరీస్ బాగా హిట్ అయింది. అందుకే దీన్ని కూడా తెలుగులో విడుదల చేశారు.
మే 3న అటు తమిళంలో ఇటు తెలుగులో అరణ్మనై 4 విడుదలైంది. అయితే ఈ సినిమా తమిళంలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. అయితే, కోలీవుడ్‌లో మాసీవ్ హిట్ అందుకున్న ఈ బాక్ మూవీ తెలుగులో మాత్రం డీలా పడిపోయింది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు అంతగా ఎక్కలేదు. దీంతో ఇక్కడ ప్లాప్‌గా నిలిచింది.ఇలా రెండు ప్రాంతాల్లో వేరు వేరు ఫలితం అందుకున్న అరణ్మనై 4 ఓటీటీలోకి వచ్చేయనుంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. జూన్ 21 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి నాలుగు భాషల్లో బాక్ మూవీని ఓటీటీ  స్ట్రీమింగ్ చేయనున్నారు. అంటే దాదాపుగా నెలన్నర తర్వాత ఓటీటీలోకి వచ్చేయనుంది గ్లామర్ హారర్ చిత్రం బాక్.ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అధికారికంగా ప్రకటించింది. దీంతో తెలుగులో మిస్ అయినవాళ్లు ఎంచక్కా ఓటీటీలో చూసేయొచ్చు. సినిమాలో తమన్నా, రాశీ ఖన్నా గ్లామర్ ట్రీట్ అదిరిపోయిందని, అలాగే సస్పెన్స్, హార్రిఫిక్ సీన్స్ మంచి థ్రిల్‌ను పంచాయని తమిళ ప్రేక్షకులు పాజిటివ్‌గా స్పందించారు. అందుకు విభిన్నంగా తెలుగు ఆడియెన్స్ రెస్పాన్స్ ఇచ్చారు. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: