ఎన్నికల సమయంలో మాత్రమే వివేకా కేసు గుర్తొస్తుందా.. ఇప్పుడు అందరూ సైలెంట్!

Reddy P Rajasekhar
ఏపీలో ఎన్నికల సమయంలో మాత్రమే వివేకా కేసు గురించి ఎక్కువగా వినిపిస్తుండటంతో పాటు ఈ కేసుకు సంబంధించి ప్రస్తావన జరుగుతుంది. ఈరోజు వైఎస్ వివేకా హత్య కేసు విచారణ జరగగా నాంపల్లి సీబీఐ కోర్టు జులై 5వ తేదీకి ఈ కేసును వాయిదా వేసింది. ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, ఇతర నిందితులు ఈరోజు విచారణ సందర్భంగా కోర్టుకు హాజరయ్యారు.
 
ఈ కేసులో సాక్షిగా పరిగణించాలంటూ దస్తగిరి వేసిన పిటిషన్ పై కూడా హైకోర్టు వాదనలు వినడం గమనార్హం. సీబీఐ చార్జిషీట్ లో కూడా దస్తగిరిని సాక్షిగా చూపారని దస్తగిరి తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అయ్యాయి. దస్తగిరి పిటిషన్ పై తదుపరి విచారణను మాత్రం సీబీఐ కోర్ట్ వచ్చే నెల 11వ తేదీకి వాయిదా వేయడం గమనార్హం.
 
ఈ కేసులో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, ఉదయ్ కుమార్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో చెక్కెదురైంది. వాళ్లు బెయిల్ కోరగా వాళ్లకు బెయిల్ మంజూరు కాలేదు. మరో నిందితుడు వైఎస్ భాస్కర్ రెడ్డికి మాత్రం కోర్టు నుంచి పూర్తిస్థాయి బెయిల్ మంజూరు అయింది. వివేకా హత్య కేసులో సునీల్ పాల్గొన్నాడని కోర్టు దృష్టికి సీబీఐ తీసుకెళ్లింది. నిందితుల మధ్య ఫోన్ కాల్ సంభాషణల రికార్డ్స్ సైతం ఉన్నాయని సీబీఐ హైకోర్టుకు తెలిపింది.
 
అయితే తెలుగు రాష్ట్రాల ప్రముఖ రాజకీయ నేతలు మాత్రం ప్రస్తుతం వివేకా కేసు గురించి సైలెంట్ గా ఉన్నారు. పాలిటిక్స్ కోసం కొంతమంది ఎంతకైనా దిగజారుతారని చనిపోయిన వాళ్ల పేర్లను ఉపయోగించుకుంటారని ఎన్నికల ఫలితాలతో అర్థమైంది. మరోవైపు కాంగ్రెస్ లో చేరి షర్మిల ఏం సాధించిందని రాష్ట్రంలో కాంగ్రెస్ కు కనీసం ఒక స్థానంలో కూడా గెలుపు దక్కలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. షర్మిలకు ఈ ఫలితాలతో జ్ఞానోదయం కలుగుతుందేమో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: