ఎటు తేల్చుకోలేకపోతున్న బాలయ్య.. చరణ్.. ఒకరు డిసైడ్ అయితే ఇంకొకరికి రూట్ క్లియర్..?

MADDIBOINA AJAY KUMAR
సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా కెరియర్ కొనసాగిస్తున్న నటులంతా చాలా వరకు ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. సినిమాలతో బిజీగా ఉన్న నటులు చాలా వరకు తమ సినిమాలకు సంబంధించిన విడుదల తేదీలను ప్రకటించి కూల్ గా తమ సినిమాలను ముందుకు తీసుకు వెళుతున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలో ఉండి కూడా విడుదల తేదీ విషయంలో సతమతం అవుతున్న హీరోలు నందమూరి నట సింహం బాలకృష్ణ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో "ఎన్ బి కే 109" అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ఇప్పటివరకు ప్రకటించలేదు. ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేస్తారు అని ఒకసారి, డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తారు అని ఒక సారి, వచ్చే సంవత్సరం జనవరి నెలలో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేస్తారు అని ఒక సారి, ఇలా అనేక సందర్భాలలో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో మూవీ బృందావనం ఉన్నట్లు అనేక వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజెర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ మూవీ షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. ఈ మూవీ ని కూడా అక్టోబర్ 31 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మూవీ బృందం ఉంది అని ఓ వార్త వైరల్ అవుతూ ఉంటే అదే సమయంలో ఈ మూవీ ని డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో కూడా మూవీ బృందం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఈ రెండు సినిమాల విడుదల తేదీ విషయాలలో ఎలాంటి క్లారిటీ పెద్దగా లేదు. ఈ మూవీ యూనిట్స్ అధికారికంగా ఈ సినిమాల విడుదల తేదీలను ప్రకటించే వరకు ఇలాంటి పుకార్లు రోజుకోటి వస్తూనే ఉంటాయి. వీటికి చెక్ పెట్టాలి అంటే మూవీ బృందం త్వరగా సినిమా విడుదల తేదీలను ప్రకటించాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: