తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో నందమూరి బాలకృష్ణ , విక్టరీ వెంకటేష్ కూడా ఉంటారు. వీరిద్దరూ ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో విజయాలను అందుకుంటు అద్భుతమైన స్థాయిలో కెరియర్ను ముందుకు సాగిస్తూ వస్తున్నారు. వీరు ఇప్పటివరకు ఎన్నో సందర్భాలలో బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే చాలా సంవత్సరాల క్రితం బాలయ్య , వెంకటేష్ నటించిన సినిమాలు కేవలం మూడు రోజుల గ్యాప్ లోనే విడుదల అయ్యాయి. ఇకపోతే చాలా తక్కువ రోజుల గ్యాప్ లో విడుదల అయిన ఈ రెండు సినిమాల కథ కూడా దాదాపుగా ఒకే మాదిరిగా ఉండడం విశేషం.
ఆ సినిమాలు ఏవి అనుకుంటున్నారా ? చాలా సంవత్సరాల క్రితం బాలయ్య "అశోక చక్రవర్తి" అనే సినిమాలో హీరోగా నటించగా ... విక్టరీ వెంకటేష్ "ధ్రువ నక్షత్రం" అనే సినిమాలో హీరో గా నటించాడు. బాలకృష్ణ హీరోగా రూపొందిన అశోక చక్రవర్తి సినిమా 1989వ సంవత్సరం జూన్ 29వ తేదీన విడుదల కాగా , వెంకటేష్ హీరోగా రూపొందిన ధ్రువ నక్షత్రం సినిమా 1989 వ సంవత్సరం జూన్ 26వ తేదీన విడుదల అయింది. ఈ రెండు సినిమాలు కూడా మంచి అంచనాలతో థియేటర్లలో విడుదల అయ్యాయి. ఇక భారీ క్రేజ్ ఉన్న ఇద్దరు హీరోలు నటించిన సినిమాలు చాలా తక్కువ రోజుల గ్యాప్ లో విడుదల కావడంతో ఈ రెండు సినిమాలలో ఏ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుంది అనే ఆసక్తి జనాల్లో భారీ ఎత్తున నెలకొంది.
ఇకపోతే భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ రెండు సినిమాల కథలు దాదాపు సమానం ఉండడం విశేషం. ఈ రెండు సినిమాలు కూడా ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ కథలతో రూపొందాయి. ఇకపోతే భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాలలో అశోక చక్రవర్తి సినిమా యావరేజ్ విజయాన్ని అందుకోగా , ధ్రువ నక్షత్రం సినిమా మంచి విజయాన్ని అందుకుంది.