వాట్..ఈ స్టార్ హీరోయిన్ త్రిషకి సిస్టరా..? ఇన్నాళ్లు ఎందుకు దాచారు..?

Thota Jaya Madhuri
ఎస్ ఇప్పుడు ఇదే వార్త కోలీవుడ్ ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. చెన్నై బ్యూటీ త్రిష గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . అందానికి అందం నటనకు నటనే  కాదు కోపం కూడా .తనని ఎవరైనా సరే టార్గెట్ చేసిన ట్రోల్ చేసిన తప్పు పట్టిన అక్కడికక్కడే ఇచ్చి పడేస్తూ ఉంటుంది . నమ్మిన వ్యక్తులని ప్రాణంగా ప్రేమించడం నమ్మకద్రోహం చేసిన వాళ్ళని దూరం పెట్టడం త్రిషకి మొదటి నుంచి అలవాటు . అంతేకాదు త్రిష ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఎంత బాగా తన సినిమాలను హైలైట్ అయ్యే విధంగా హిట్ చేసుకునేందో.  సెకండ్ ఇన్నింగ్స్ లోను అదే విధంగా ముందుకు దూసుకెళ్తుంది. మంచి మంచి కథ కంటెంట్ ఉన్న సినిమాలనే చూస్ చేసుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్ లోను తనదైన స్టైల్ లో దూసుకుపోతున్న త్రిష తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.


ఆ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా చెప్పుకొచ్చింది . స్టార్ హీరోయిన్ త్రిష ఈ ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ హీరో హీరోయిన్లు ఎవరు అన్న విషయం కూడా చెప్పుకొచ్చింది. మరీ ముఖ్యంగా కోలీవుడ్ నుంచి పలు  స్టార్ హీరోస్ పేర్లు చెప్పిన త్రిష హీరోయిన్స్ విషయం వచ్చేసరికి నిత్యామీనన్ - సాయి పల్లవి అంటే చాలా చాలా ఇష్టం అంటూ చెప్పుకు వచ్చింది . అంతేకాదు సాయి పల్లవి డాన్స్ అంటే మరింత ఇష్టమంటూ కూడా పొగిడేసింది.


 చూడడానికి సాయి పల్లవి  తను సిస్టర్స్ లా ఉంటారు అని తన బంధువులు చాలా వరకు చెప్పారు అని ..కొన్ని కొన్ని సార్లు కొన్ని యాంగిల్స్ లో నాకు అలాగే అనిపిస్తూ ఉంటుంది అని త్రిష చెప్పుకోరావడం హైలైట్ గా మారింది . అయితే కోలీవుడ్ జనాలు దీనిపై డిఫరెంట్ డిఫరెంట్ గా స్పందిస్తున్నారు . నిజంగానే మీ ఇద్దరు సిస్టర్స్ లా ఉంటారు . ఇన్నాళ్లు ఎందుకు ఈ విషయం దాచారు అంటూ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు . త్రిష సాయి పల్లవి సిస్టర్స్ అనే న్యూస్ ఇప్పుడు హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. సాయి పల్లవి నటించిన "అమరన్" సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది . దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీ ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో మరో మంచి హిట్ తన ఖాతాలో వేసుకోబోతుంది సాయి పల్లవి అనడంలో సందేహం లేదు.  త్రిష విశ్వంభర సినిమాలో చిరంజీవికి జోడిగా నటిస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: