ఇండియా లోనే గొప్ప దర్శకుడు గా పేరు తెచ్చుకున్న వారిలో
శంకర్ ఒకరు . ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించాడు . ఆయన దర్శకత్వం వహించిన సినిమాలలో చాలా సినిమాలు అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకున్నాయి . దానితో ఈయన కు దేశం లోనే గొప్ప దర్శకుడిగా గుర్తింపు లభించింది . గత కొంత కాలంగా మాత్రం
శంకర్ దర్శకత్వం వహించిన సినిమాలు అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకోవడం లేదు . ఆఖరుగా ఈయన దర్శకత్వం వహించిన రోబో
సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత ఈయన దర్శకత్వం వహించిన స్నేహితుడు , ఐ , రోబో 2.0 సినిమాలు యావరేజ్ విజయాలను అందుకోగా తాజాగా
శంకర్ దర్శకత్వంలో రూపొందిన
ఇండియన్ 2
మూవీ మాత్రం భారీ అపజయాన్ని ఎదుర్కొంది. తాజాగా
శంకర్ "గేమ్ చేంజర్" అనే
మూవీ ని రూపొందించాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.
రామ్ చరణ్ ఈ సినిమాలో హీరోగా నటించగా ...
తమన్ సంగీతం అందించిన. ఈ
మూవీ ని దిల్ రాజు నిర్మించాడు.
ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం
సంక్రాంతి పండుగ సందర్భంగా
జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం
శంకర్ "అపరిచితుడు" అనే
మూవీ ని తెరకెక్కించాడు. ఆ
మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాను హిందీలో రన్బీర్ సింగ్ హీరోగా రూపొందించాలి అని
శంకర్ ప్లాన్ చేశాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ
సినిమా స్టార్ట్ కాలేదు. ఇక ఈ
మూవీ స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా లేవు అని వార్తలు వస్తున్నాయి.