అరే నాకేం తెలుసు బ్రో.. అతనికి హిందీ వస్తదని.. పంత్ కామెంట్స్.. వీడియో వైరల్?

praveen

పుణె వేదికగా భారత్ - న్యూజిలాండ్‌ మధ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 2వ టెస్టులో చాలా ఆసక్తి కరమైన అంశాలు చోటుచేసుకున్నాయి. విషయంలోకి వెళితే, తొలి రోలు ఆట పూర్తయ్యే సరికి టీమిండియా.. కెప్టెన్ రోహిత్ శర్మ (0) వికెట్‌ను కోల్పోయి 16 పరుగులు మాత్రమే చేయగలిగింది. యశస్వీ జైస్వాల్ (6), శుభ్‌మన్ గిల్ (10) క్రీజులో ఉన్నారు. ఇక అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌట్ అయ్యింది. డెవాన్ కాన్వే (76; 141 బంతుల్లో, 11 ఫోర్లు), రచిన్ రవీంద్ర (65; 105 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధశతకాలు సాధించారు.
భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 7 వికెట్స్ తీయగా, రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో గురువారం ఆటలో ఓ సరదా సంఘటన చోటు చేసుకుంది. న్యూజిలాండ్ ప్లేయర్ అజాజ్ పటేల్‌కు హిందీ రాదని సుందర్‌కు రిషభ్ పంత్ హిందీలో సూచనలు ఇస్తుండగా అవి బెడిసి కొట్టాయి. విషయం ఏమిటంటే, 78వ ఓవర్‌లో వాషింగ్టన్ సుందర్‌కు పంత్ హిందీలో సూచనలు ఇచ్చాడు. క్రీజులో ఉన్న అజాజ్ పటేల్‌కు లిటిల్ ఫుల్లర్‌గా బౌలింగ్ చేయమని సూచనలు చేసాడు. అయితే ఆ బంతిని అజాజ్ సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. మిడాన్ మీదుగా బౌండరీ కొట్టాడు. ఇక్కడ పంత్ సూచనలు పనిచేయకపోవడమే కాకుండా బెడిసి కొట్టడంతో సుందర్ అసహనంగా చూశాడు.
దానికి పంత్ 'అరె.. అతనికి హిందీ అర్థమవుతుందని నాకేం తెలుసు రా! ఏమీ ఫీల్ అవ్వకు.. నేను ఇలా బుక్ అయ్యి, నిన్ను బుక్ చేస్తానని అస్సలు ఊహించలేదు!' అంటూ బదులిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో జనాలు ఈ వీడియోని మరలా మరలా చూస్తూ, షేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, వాషింగ్టన్ సుందర్‌కు పంత్ ఇచ్చిన సూచన మొత్తం హిందీలోనే ఉన్నప్పటికీ 'లిటిల్ ఫుల్లర్' అంటూ ఇంగ్లిష్‌లోనే చెప్పడం జరిగింది. ఈ పదం అర్థం చేసుకుని అజాజ్ పటేల్ బౌండరీ బాది ఉంటాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, అదే ఓవర్ ఆఖరి బంతికి అజాజ్ పటేల్‌ను సుందర్ క్లీన్ బౌల్డ్ చేసి, పరువు కాపాడుకున్నాడు.. అది వేరే విషయం!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: