ట్రైలర్: అదిరిపోయిన కల్కి 2898 AD సెకండ్ ట్రైలర్..!

Divya
ప్రభాస్ అభిమానులు చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్న కల్కి 2898AD సినిమా పేరు గత కొద్ది రోజుల నుంచి మారుమోగుతోంది. భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలతో పాటు దేశమంతా కూడా చాలా ఎక్సైటింగ్గా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తూ ఉండడం గమనార్హం. జూన్ 27వ తేదీన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది ఈ క్రమంలోనే కల్కి సినిమా ప్రమోషన్స్ ను కూడా చిత్ర బృందం వేగవంతం చేస్తోంది.

ఇప్పటికే కల్కే సినిమాకు సంబంధించి పాటలు టీజర్ ట్రైలర్లను విడుదల చేయగ తాజాగా రెండవ ట్రైలర్ను కూడా గడిచిన కొన్ని నిమిషాల క్రితం విడుదల చేసింది. ఇప్పటికే కల్కి సినిమా ఫ్రీ బుకింగ్ టికెట్లు కూడా భారీగానే అమ్ముడుపోయాయి. ఏకంగా ఇతర దేశాలలో రెండు మిలియన్ల టికెట్లు కూడా అడ్వాన్సింగ్ బుకింగ్ కావడంతో ప్రభాస్ రేంజ్ రోజ్ రోజుకి పెరుగుతోంది. తాజాగా కల్కి సినిమా నుంచి మరో ట్రైలర్ ని సైతం చిత్ర బృందం విడుదల చేశారు.

ఫైనల్ వార్ పేరుతో ఓ ట్రైలర్ను రిలీజ్ చేసిన చిత్ర బృందం గతంలో విడుదల చేసిన ట్రైలర్ తో పోలిస్తే ఈ ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకి హైలైట్ గా ఉండబోతున్నాయి విజువల్స్ కూడా అదిరిపోయేలా కనిపిస్తోంది.ఈ చిత్రంలో అమితాబచ్చన్, కమలహాసన్ తో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా నటిస్తూ ఉన్నారు. దీపికా పదుకొనే , దిశాపటాని  వంటి వారు ప్రభాస్ కు జోడిగా నటిస్తున్నారు. మేకర్స్ కూడా చివరిలో ఒక బిగ్ సర్ప్రైజ్ ఉందంటూ తెలియజేశారు అలాగే బుజ్జి అంటూ స్పెషల్ వీడియోను కూడా విడుదల చేసి మరింత హైప్ పెంచారు. మరి మొత్తానికి జూన్ 27వ తేదీ వరకు అభిమానులు ఎగ్జైటింగ్ గా ఎదురు చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: