మళ్లీ బిజీ అయిన శ్రీ లీల... ఏకంగా మూడు సినిమాలు..?

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి శ్రీ లీలా పోయిన సంవత్సరం వరుస సినిమా షూటింగ్ లతో తీరిక అనేది లేకుండా సమయాన్ని గడిపింది. ఈ బ్యూటీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా విడుదల అయినటువంటి గుంటూరు కారం సినిమాతో ఆఖరుగా ప్రేక్షకులను పలకరించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల అయింది. పోయిన సంవత్సరం వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ ఈ సంవత్సరం మాత్రం ఆ స్థాయిలో సినిమాలతో ప్రేక్షకులను పలకరించలేదు.

ఇప్పటికే ఈ నటి నటించిన సినిమా విడుదల అయ్యి ఆరు నెలలు పూర్తయింది. కానీ ఇప్పటివరకు శ్రీ లీల నుండి ఈ సంవత్సరం రెండవ సినిమా రాలేదు. ఇక మళ్ళీ ఈ బ్యూటీ సినిమా షూటింగ్ లతో ఫుల్ బిజీ అయ్యింది. ప్రస్తుతం శ్రీ లీలా , నితిన్ హీరోగా వెంకి కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న రాబిన్ హుడ్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్లో ఈ బ్యూటీ పాల్గొంటుంది. ఈ సినిమాతో పాటు రవితేజ హీరోగా రూపొందుతున్న ఓ సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది.

ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ పోయిన సంవత్సరం ప్రారంభం అయిన విషయం మనకు తెలిసింది. పవన్ ఇంతకాలం పాటు రాజకీయ పనులతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇక దాదాపుగా పవన్ రాజకీయ పనులు అన్ని పూర్తి కావడంతో మళ్లీ ఈ సినిమాను తిరిగి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. దానితో ఈ ముద్దుగుమ్మ కూడా ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ లో ఈమె జాయిన్ అయినట్లు అయితే శ్రీ లీలా ఒకేసారి మూడు సినిమాల షూటింగ్ తో మళ్లీ ఫుల్ బిజీ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: