వరుణ్ ఆశలన్నీ ఆ మూవీ పైనే... అదికానీ తేడా కొడితే ఇక అంతే..?

Pulgam Srinivas
మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ "ముకుంద" అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన మూవీ కావడం, వరుణ్ తేజ్ నటించిన మొట్ట మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. కాకపోతే ఈ సినిమా ద్వారా వరుణ్ కి మంచి గుర్తింపు తెలుగులో లభించింది.

అందులో భాగంగా ఈయన తక్కువ కాలంలోనే మంచి విజయాలను అందుకొని నటుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు. కెరియర్ ప్రారంభంలో మంచి విజయాలను అందుకున్న ఈ నటుడు ఈ మధ్యకాలంలో వరుసగా అపజాయలను ఎదుర్కొంటున్నాడు. గని సినిమా దగ్గర నుండి మొదలు పెడితే కొన్ని రోజుల క్రితం విడుదల అయిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలో వరకు ఈయన నటించిన మూవీలలో "ఎఫ్ 3" చిత్రం ఒక్కటే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది.

ఈ సినిమాలో కూడా వెంకటేష్, వరుణ్ హీరోలుగా నటించారు. కాబట్టి అందులో సగం క్రెడిట్ వెంకటేష్ కు కూడా వెళ్ళిపోతుంది. ప్రస్తుతం ఈ నటుడు మట్కా అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ సినిమా నుండి మేకర్స్ ఇప్పటికే కొన్ని పోస్టర్ లను విడుదల చేయగా అవి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాపై వరుణ్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఈ మూవీ ద్వారా కచ్చితంగా హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి రావాలి అని ఈ యువ నటుడు కసిగా ఉన్నాడు. మరి ఈ సినిమాతో వరుణ్ మంచి హిట్ కొట్టి ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vt

సంబంధిత వార్తలు: