"హరిహర వీరమల్లు" కి కొత్త డైరెక్టర్... ఇదిగో ప్రూఫ్..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర విరమల్లు అనే సినిమా చాలా రోజుల క్రితం ప్రారంభం అయింది  ఇక ఈ మూవీ లో నిధి అగర్వాల్ , పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ...  ఏ ఏం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత ఆగిపోయింది. మళ్ళీ ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు.

మళ్లీ కూడా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇక ఈ మూవీ నీ స్టార్ట్ చేసిన తర్వాత క్రిష్ "కొండపోలం" అనే మూవీ ని రూపొందించి విడుదల కూడా చేశాడు. ఇక కొన్ని రోజుల క్రితమే అనుష్క ప్రధాన పాత్రలో ఘాటి అనే సినిమాను కూడా ప్రారంభించాడు. దానితో హరిహర వీరమల్లు సినిమా మొత్తానికి ఆగిపోయింది అనే వార్తలు వచ్చాయి. కాకపోతే ఈ మూవీ మేకర్స్ మాత్రం ఈ సినిమా ఆగిపోలేదు.

ఇది చాలా పెద్ద స్పాన్ ఉన్న సినిమా. చాలా తొందరగా తీయలేము. కొంచెం టైం పడుతుంది. కాకపోతే కచ్చితంగా ఈ సినిమా జనాల ముందుకు వస్తుంది అని చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈ రోజు హరిహర వీరమల్లు సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఈ సినిమా టీజర్ విడుదల కాబోతున్నట్లు తెలియజేస్తూ చిత్ర బృందం రెండు పోస్టర్ లను విడుదల చేసింది. ఈ రెండింటిలో ఎక్కడ కూడా క్రిష్ పేరు లేకపోవడంతో ఈ సినిమా నుండి క్రిష్ తప్పుకున్నారు అని వేరే దర్శకుడు ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు చేపట్టబోతున్నారు అని వార్తలు వచ్చాయి.

ఇకపోతే తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల అయింది. ఇందులో క్రిష్ తో పాటు రూల్స్ రంజన్ మూవీ దర్శకుడు అయినటువంటి జ్యోతి కృష్ణ పేరుని కూడా వేశారు. దీనితోనే క్రిష్ ఈ మూవీ నుండి తప్పుకున్నట్లు జ్యోతి కృష్ణ ఈ సినిమా బాధ్యతలను తీసుకున్నట్లు అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: