వ‌ల‌సాంధ్ర‌: ఉపాధి - ఉద్యోగ‌మే అస‌లు స‌మ‌స్య‌..!

RAMAKRISHNA S.S.
- ఏపీలో ప్ర‌భుత్వ ఉద్యోగాలు కాదు ప్రైవేటు ఉపాధి క‌రువే
- బాబు ప్ర‌భుత్వంలో స్టార్ట‌ప్‌ల‌కు ప్రాధాన్యం.. వాటికి మంగ‌ళం పాడేసిన జ‌గ‌న్‌
- ఉపాధి, ఉద్యోగం కోసం బ‌య‌ట రాష్ట్రాల‌కు వెళుతోన్న యువ‌త 12 %
( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
ఉమ్మ‌డి రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. ఏపీకి అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. రాజ‌ధాని లేదు. ఆదాయం లేదు.  కేంద్రం నుంచి స‌హ‌కారం కూడా లేద‌నే చెప్పాలి. అయితే.. వీట‌న్నింటికీ తోడు.. మ‌రో కీల‌క‌మైన స‌మ‌స్య‌.. ఉపాధి-ఉద్యోగ అవ‌కాశాలు. ఈ రెండు విష‌యాలు కూడా.. రాష్ట్రాన్ని ప‌ట్టిపీడిస్తున్నాయి. విభ‌జ‌న త‌ర్వా త‌.. రాష్ట్ర జ‌నాభా ఎక్కువ‌గా పెరిగింద‌నేది వాస్త‌వం. గ‌డిచిన ప‌దేళ్ల‌లో 5 శాతం జ‌నాభా పెరిగింద‌ని గ‌ణాం కాలు చెబుతున్నాయి. అయితే.. దీనికితోడు.. పెర‌గాల్సిన ఉపాధి, ఉద్యోగాలు వంటివి నానాటికీ క్షిణిస్తు న్నాయి.

మారుతున్న కాలానికి అనుగుణంగా.. యువ‌త‌లోనూ.. పెద్ద ఎత్తున ఆస‌క్తులు పెరుగుతున్నాయి. చ‌దువు లు కూడా విస్త‌రిస్తున్నాయి. ఐఐటీ, ఐఐఎం, బీటెక్‌, ఎంటెక్ వంటివి విస్త‌రిస్తున్నాయి. ఇలాంటి స‌మ‌యం లో చ‌దువుకున్న విద్య‌కు స‌రిసమాన‌మైన ఉపాధి, ఉద్యోగాల‌ను యువ‌త కోరుకుంటున్నారు. దీనిలో ప్ర‌ధానంగా ప్ర‌భుత్వ సెక్టార్ కీల‌క పాత్ర పోషిస్తోంది. గ్రూప్‌-1, 2 వంటివాటికి డిమాండ్ పెరుగుతోంది. ఈ పెరుగుతున్న డిమాండ్ మేర‌కు ఉద్యోగ క‌ల్ప‌న ప్ర‌భుత్వాల‌కు క‌ష్ట సాధ్యంగా మారింది.

ఇదే స‌మ‌యంలో పెరుగుతున్న అక్ష‌రాస్య‌త కూడా.. ఉపాధికి, ఉద్యోగ అవ‌కాశాల‌కు డిమాండ్ పెంచుతోం ది. అయితే..ఈ స‌మ‌స్య ఒక్క ఏపీలోనే కాదు. కేంద్రంలోనూ ఉంది. ఈ నేప‌థ్యంలోనే కేంద్రం ఉపాధి క‌ల్ప‌న‌కు , స్టార్ట‌ప్‌ల‌కు ప్రాధాన్యం ఇస్తోంది. యువ‌త‌ను సొంత వ్యాపారాలు, ప‌రిశ్ర‌మ‌ల స్థాపన దిశ‌గా ప్రోత్స‌హిస్తోంది. త‌ద్వారా.. స‌మాజంలో ఉద్యోగ స‌మస్య‌కు ప‌రిష్కారం చూపించ‌డంతోపాటు.. ఉపాధి క‌ల్ప‌న ద్వారా ఒక్కొక్క యూనిట్‌కు 10 మంది చొప్పున ఉపాధి పొందినా.. అది మ‌రింతగా స‌మ‌స్యను త‌గ్గిస్తుంద‌నే అంచ‌నా ఉంది.

అందుకే.. ప్ర‌స్తుతం బీజేపీ పెట్టిన కేంద్ర మేనిఫెస్టోలో ఉద్యోగాల క‌ల్ప‌న‌కు పెద్ద‌పీట వేయ‌కుండా.. ఉపాధి దిశ‌గా మార్గాలు చూపించేందుకు పెద్ద‌పీట వేసింది. బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించ‌డంతోపాటు.. స‌బ్సిడీలు పెంచ‌డం కూడా.. దీనిలో భాగ‌మే. గ‌త 2014 నుంచి కూడా కేంద్రంలోని మోడీ స‌ర్కారు స్టార్ట‌ప్‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం వెనుక‌.. ఉపాధి క‌ల్ప‌న కీల‌క అంశంగా ఉంది. ఈ కోణంలోనే యూపీ స‌హా బిహార్‌, గుజ‌రాత్ వంటి రాష్ట్రాలు యువ‌త‌ను స్టార్ట‌ప్‌ల దిశ‌గా ప్రోత్స‌హిస్తున్నాయి.

ఏపీ వంటి రాష్ట్రాలు కూడా.. ఆదిశ‌గా యువ‌త‌ను ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రం ఉంది. ప్ర‌భుత్వ రంగం లోనే ఉద్యోగాలు ఉన్నాయా? అంటే.. లేవ‌నే చెప్పాలి. ఇలాంటి స‌మ‌యంలో స్వ‌యం ఉపాధి, స్టార్ట‌ప్‌ల‌కు పెద్ద‌పీట వేసే దిశ‌గా పార్టీలు, నాయ‌కులు, ప్ర‌బుత్వాలు కృషి చేయాల్సిన అవ‌స‌రం ఉంది. త‌ద్వారా మరింత మందికి ఉపాధి క‌ల్పించే అవ‌కాశం ఉంది. కానీ, ఇప్పుడున్న రెండు కీల‌క పార్టీలు కూడా.. ఉచితాల‌కు ఇస్తున్న ప్రాధాన్యంయువ‌త‌కు ఇవ్వ‌డం లేద‌నేది నిర్వివాదాంశం.

నిజానికి స‌మాజంలో ఉపాధి మెరుగు ప‌డేందుకు స్టార్ట‌ప్‌లు కీల‌క పాత్ర పోసిస్తున్న‌ప్పుడు.. ఆదిశ‌గా ప్ర‌భు త్వాలు ప‌నిచేస్తే.. స‌మాజంలో కొంత మేర‌కైనా ఉద్యోగ క్షీణ‌త త‌గ్గుతుంది. గ‌తంలో చంద్ర‌బాబు ఆ దిశ‌గా కొంత ప్ర‌య‌త్నాలు చేశారు. ఐటీ ప‌రిశ్ర‌మ‌లు తీసుకురావ‌డంతోపాటు.. సొంతగా స్టార్ట‌ప్‌లు పెట్టాల‌ను కునేవారికి కొంత మేర‌కు ప్రోత్సాహం ఇచ్చారు. త‌ర్వాత వ‌చ్చిన వైసీపీ ప్ర‌భుత్వం కూడా ప్ర‌య‌త్నాలు చేసినా.. క‌రోనా కార‌ణంగా ఈ ప్ర‌య‌త్నాలు కుంటుప‌డ్డాయి. ఇక‌, ఆ త‌ర్వాత‌.. రాజ‌ధానిమార్పు నిర్ణ‌యంతో వ‌ల‌స‌లు పెరిగాయి.

ప్ర‌స్తుతం ఉపాధి , ఉద్యోగాల‌ను కాంక్షించి.. ఇతర‌రాష్ట్రాల‌కు పోతున్న ఏపీ యువ‌త 12 శాతంగా ఉంద‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఇది నిజానికి చాలా ఎక్కువ‌గానే ఉంది. తెలంగాణ‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌తో పాటు.. ఢిల్లీ వెళ్తున్న యువ‌త కూడా ఎక్కువ‌గానే ఉన్నారు. వీటినిత‌గ్గించేందుకు, యువ‌త‌ను ఉపాధి దిశ‌గా న‌డిపించేందుకు నూత‌న ప్ర‌భుత్వాలు కృషి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: