ఎడిటోరియల్ : చంద్రబాబు, పవన్ కు ఆళ్ళ సవాల్..అత్యంత ఖరీదైన నియోజకవర్గం ఇదేనా ?

Vijaya

మంగళగిరి వైసిపి అభ్యర్ధి, సిట్టింగ్ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ కు ఒకేసారి ఛాలెంజ్ విసిరారు. దమ్ముంటే ఇద్దరు తనపై పోటీ చేయాలంటూ మీడియా సమావేశంలో సవాలు విసరటం గమనార్హం. పోయిన ఎన్నికల్లో ఆళ్ళ గెలిచింది కేవలం 13 ఓట్లతోనే అయినా తర్వాత మాత్రం నియోజకవర్గంలో పాతుకుపోయారు. వివిధ వర్గాలకు దగ్గరయ్యేందుకు ఆళ్ళ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దాంతో నియోజకవర్గంలో వైసిపి ఎంఎల్ఏ తిరుగులేని నేత అయిపోయారు.

 

ప్రధానంగా ఈ నియోజకవర్గం టిడిపికి పెద్ద మైనస్ అనే చెప్పాలి. ఎందుకంటే, రాజధాని పేరుతో చంద్రబాబు రైతుల నుండి తీసుకున్న పంటభూములే ప్రధాన అంశం. చాలామంది రైతులనుండి చంద్రబాబు బలవంతంగా భూములను లాగేసుకున్నారు. ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించే వందలాది  రైతుల తరపున ఆళ్ళ కోర్టుల్లో కేసులు వేశారు. కొన్ని కేసుల్లో కోర్టులు స్టేలు ఇవ్వగా మరికొన్ని కేసులు విచారణలో ఉన్నాయి.

 

అలాగే వందల కోట్ల విలువైన సదావర్తి సత్రం భూములను చంద్రబాబు కారుచవకగా కొట్టేయటనానికి వేసిన ఎత్తులను ఆళ్ళే దెబ్బ కొట్టారు.  ఆళ్ళ కృషి ఫలితంగానే వందలాది ఎకరాలు ఇంకా ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నాయి. ఇక, పేదలకు 4 రూపాయలకే రాజన్న భోజనం పెట్టటం, పది రూపాయలకే చవకగా ఆరు రకాల కూరగాయలు, ఆకుకూరలు ఎప్పటి నుండో పంపిణీ చేస్తున్నారు.

 

ఒకవైపు ప్రజల తరపున సమస్యలపై ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే మరోవైపు సొంత ఖర్చులతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఆళ్ళంటే సామాజికవర్గాలకు అతీతంగా సానుకూలత ఉంది. ఆ ధైర్యంతోనే తనపై పోటీ చేయాలని ఆళ్ళ సిఎంతో పాటు పవన్ ను కూడా ఛాలెంజ్ చేశారు. మరి వాళ్ళిద్దరూ ఆళ్ళ సవాలును స్వీకరిస్తారా ?

 

ప్రస్తుతం మంగళగిరిలో టిడిపి తరపున నారా లోకేష్ పోట చేస్తున్నారు. ఎలాగైనా లోకేష్ ను గెలింపుచుకోవాలని టిడిపి ఇప్పటికే పెద్ద ఎత్తున తాయిలాల పంపిణి మొదలుపెట్టింది. ప్రతీ ఓటరుకు రూ 10 వేలతో పాటు ఓ స్మార్ట్ ఫోన్ పంపిణీ చేస్తున్నట్లు ఆళ్ళ చెబుతున్నారు. టిడిపి వరస చూడబోతే  రాబోయే ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద మంగళగిరే అత్యంత ఖరీదైన నియోజకవర్గమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.  

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: