ఇవాళ ఏపీలో మోదీ మోటింగ్‌.. ఆయనతో ఆ చెప్పిస్తే బాబుకు తిరుగులేదు?

మ్యానిఫెస్టోలు పోటీ పడి దించారు. సంక్షేమాన్ని నిండుగా కుమ్మరించారు. ఉచిత పథకాలను వేలం పాట మాదిరిగా   పోటీ పడి మరీ పెద్ద నంబర్లు వేసి ముందుంచారు. అయినా ఏపీ ప్రజల్లో ఎన్నికలకు సంబంధించి ఎలాంటి రియాక్షన్ రాలేదు. ఇంకా ఎవర్నీ ఎన్నుకోవాలో అనే సంశయంలోనో చాలామంది తటస్థులు ఉన్నారు.

సరిగ్గా ఈ సమయంలోనే టీడీపీ ఒక అంశాన్ని తీసుకొంది. ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది 2023 నుంచి అమల్లోకి వచ్చినా.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై చాలా రోజులు అవుతున్నా దీని గురించి పెద్దగా చర్చ జరగలేదు. కానీ ఇప్పుడు ఇదే రాజకీయ అస్త్రంగా మారిపోయింది. ప్రధాన ప్రతిపక్షాలు టీడీపీ, జనసేన దగ్గర నుంచి అధికార పక్షం వరకు దీని గురించే చర్చంతా నడుస్తోంది. ప్రతి సభలోను ఈ చట్టం గురించే మాట్లాడుతూ హైలెట్ చేస్తున్నారు.

దీంతో పాటు టీడీపీ అనుకూల మీడియాలో దీని గురించే వండి వారుస్తున్నారు. వాస్తవంగా ఇది ఏపీలో ఇంకా అమలు కాలేదు. కానీ ఇది జగన్ ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర విమర్శలు కురిపించే అస్త్రంగా మాత్రం మారింది.  వాస్తవంగా దీనిని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. దీనిపై కేంద్రం పార్లమెంట్ లో బిల్లు చేస్తే ఆ తర్వాత ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఆంధ్రాలో మాత్రం ఈ చట్టం ఇంకా అమల్లోకి రాలేదు.

ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే చట్టం ఫ్రేమ్ కాలేదు.  లేని చట్టాన్ని చంద్రబాబు రద్దు చేస్తామని చెబుతున్నారు. 2019లో నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన చట్టాన్నే ఏపీలో అమలు చేయాలని చూశారు. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా 17 వేల గ్రామాల్లో భూ సర్వే జరుగుతుంది.   ఈ చట్టాన్ని రద్దు చేస్తామని టీడీపీ చెబుతోంది. ఈ విషయాన్ని రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ చేత చెప్పిస్తారా అని విశ్లేషకులు ప్రశ్నిస్తారు.  ఎన్డీయే కూటమిలోని పార్టీయే కేంద్రం చేసిన చట్టాన్ని తప్పని ప్రశ్నిస్తోంది.  తాము ప్రతిపాదించిన చట్టం తప్పని.. ఈ  చట్టం ఏపీలో అమలు చేయమని ప్రధాని మోదీ చేత చెప్పిస్తారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: