అందాల ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దగ్గుపాటి రానా హీరోలుగా రూపొందిన భీమ్లా నాయక్ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది . ఈ సినిమాలో ఈమె రానా కు భార్య పాత్రలో నటించింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడం , ఇందులో ఈమె తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించడంతో ఈ సినిమా తర్వాత నుండి ఈమెకు వరుసగా తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి.
అందులో భాగంగా ఈమె భీమ్లా నాయక్ మూవీ తర్వాత బింబిసారా , విరూపాక్ష , డెవిల్ సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ఇందులో బింబిసారా , విరూపాక్ష మూవీ లు మంచి విజయాలను అందుకోగా , డెవిల్ మూవీ మాత్రం ప్రేక్షకులను నిరుత్సాహ పరిచింది. ఇకపోతే తాజాగా లవ్ మీ అనే సినిమా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో చివరలో సంయుక్తా మీనన్ ను చూపించి లవ్ మీ మూవీ.కి కొనసాగింపుగా కిల్ మీ మూవీ అనే మూవీ ని రూపొందించనున్నట్లు చూపించారు.
ఒక వేళ నిజంగానే కిల్ మీ మూవీ కనుక తెరకెక్కినట్లు అయితే అందులో సంయుక్త మీనన్ కీలక పాత్రలో కనిపించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇకపోతే సినిమాలలో అందాలను భారీగా ఆరబోసే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో అందాలను ఓలకబోస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే టైట్ డ్రెస్ ను వేసుకుని తన హాట్ యాంగిల్స్ ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.