ఈ లెక్కలు చూడండి.. ఇదీ జగన్‌ తెచ్చిన విప్లవం?

తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు మంచి పాఠశాలల్లో చదువు చెప్పించాలని చూస్తుంటారు. ఇందుకోసం కష్టపడుతుంటారు. చిన్నప్పటి నుంచి నాణ్యమైన విద్య అందించాలని ఆశపడుతుంటారు. అందుకే ఆస్తులు కూడబెట్టడం కన్నా.. పిల్లలను చదివించేందుకు ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. దీనికోసం రేయింభవళ్లు కష్టపడతారు. పిల్లలను బెస్ట్ స్కూల్స్ లో చేర్పించాలని చూస్తారు.

పిల్లలకు మంచి పాఠశాలల్లో చదువు చెప్పించాలని తల్లిదండ్రుల బలహీనతే కార్పొరేట్ పాఠశాలలకు పెట్టుబడిగా మారుతోంది. తల్లిదండ్రుల కోరికను పాఠశాలల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. విద్య ఇప్పటికే వ్యాపారంగా మారింది. కార్పొరేట్ పాఠశాలల పేరుతో హంగులు, ఆర్భాటాలు చూపుతూ ఏటా ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతున్నారు. పెరుగుతున్న ఫీజులు చూస్తుంటే తల్లిదండ్రుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక మెడికల్, ఇంజినీరింగ్ ఫీజుల విషయానికొస్తే పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందని ద్రాక్షలానే మారింది. కార్పొరేట్ కళాశాలల్లో ఇంజినీర్, డాక్టర్ కోర్సు చేయాలంటే ఆస్తులు తనఖా పెట్టాల్సిన పరిస్థితి మధ్య తరగతి కుటుంబంలో కనిపిస్తూ ఉంది.

ఇక ఏపీ విషయానికొస్తే సీఎం జగన్ వచ్చాక విద్యారంగంలో సమూల మార్పులు వచ్చాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు కొన్ని తీసుకుంటే.. చంద్రబాబు నాయుడి హయాంలో ఫీజులను భారీగా పెంచేసి కార్పొరేట్ యాజమాన్యాలకు మేలు చేకూర్చి మధ్య తరగతి వారి నడ్డి విడిచారు. పీజీ కేటగిరీ ఫీజు చంద్రబాబు హయాంలో రూ.25 లక్షలు ఉండేది.  ఇది అంతకు ముందు రూ.5 లక్షలు ఉంటే దీనిని ఐదింతలు పెంచి రూ.25 లక్షలు చేశారు.

బీ కేటగిరీ ఎంబీబీఎస్ ఫీజును రూ.2.40 లక్షల నుంచి మొదట రూ.10లక్షలు, ఆ తర్వాత రూ.11.50లక్షలకు పెంచుకుంటూ పోయారు. జగన్ వచ్చిన తర్వాత ఏ కేటగిరీ, బీ కేటగిరీ ఫీజులను సగానికి సగం తగ్గించారు. ఇది ఓ రకంగా చెప్పాలంటే మధ్య తరగతి వారికి మేలు చేసినట్లే. జగన్ వచ్చిన తర్వాత వచ్చిన విప్లవాత్మక మార్పు ఇదని విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: