చంద్రబాబు, రామోజీ.. ఇద్దరికీ మోదీ బిగ్‌ షాక్‌.. జగన్‌పై ఈగ వాలనీయలేదుగా?

టీడీపీ అధినేత చంద్రబాబు  నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఒకటి రాజకీయ స్వప్రయోజనాలు కాగా.. రెండోది ప్రధాని మోదీ మాటకు విలువ ఎక్కువగా ఉండటం. ఐదేళ్లుగా చంద్రబాబు ఏపీ సీఎం జగన్ పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈక్రమంలో తన మాట కన్నా ప్రధాని మోదీ మాటకు విలువ ఎక్కువ ఉంటుందని.. సీఎం జగన్ , వైసీపీ ప్రభుత్వంపై మోదీ చేత విమర్శలు చేయిస్తే అవి ప్రజల్లోకి బలంగా వెళ్తాయని ఆయన భావించారు.

కానీ తానొకటి తలిస్తే దైవమెకటి తలచింది అన్నట్లుగా.. ప్రధాని మోదీ మాత్రం చంద్రబాబు వలలో పడకుండా.. తన వ్యూహాలనే అమలు చేస్తున్నారు. గతంలో చిలకలూరిపేటలో జరిగిన సభలోను సీఎం జగన్ ను, వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించకుండా మంత్రులు ఆరోపణలు చేస్తున్నారు అని దుయ్యబట్టారు. తద్వారా జగన్ కు క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది. ఇక తాజాగా పీఎం మోదీ ఈనాడు కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఇందులో ఏపీకి సంబంధించి పలు ప్రశ్నలు అడిగారు. అయితే ఇందులో మోదీ టీడీపీకి అవకాశం ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడారు. వైసీపీని కానీ.. ప్రభుత్వాన్ని కానీ పల్లెత్తు మాట అనలేదని అన్నట్లు కనిపిస్తోంది. ఏ తరహా ఆరోపణ చేసినా బ్యానర్ హెడ్డింగ్ అదే అయ్యేది. కానీ పోలవరం బేస్ చేసుకొని హెడ్డింగ్ పెట్టారంటే.. కచ్చితంగా జగన్ గురించి నెగిటివ్ గా మాట్లాడలేదు.

పోలవరం గురించి ప్రస్తావించగా.. అది జాతీయ ప్రాజెక్టు అని దీనిని పూర్తి చేసే బాధ్యత తమదేనని ధృడమైన హామీ ఇస్తున్నా అని అన్నారు. అంతే కానీ చంద్రబాబు హయాంలో ఎక్కువ నిర్మాణం జరిగింది.. జగన్ దానిని పక్కన పెట్టేశారు వంటి వ్యాఖ్యలు చేయలేదు. ఒకవేళ చేసుంటే దానినే ఈనాడు ప్రముఖంగా ప్రస్తావించి చంద్రబాబుకి మైలేజ్ వచ్చేలా చేసేది. అలా చేయలేదంటే మోదీ ఏపీ విషయంలో వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నట్లు అనిపిస్తోంది. మొత్తం మీద మోదీ అటు టీడీపీకి, ఇటు ఎల్లో మీడియాకు షాక్ ఇచ్చినట్లు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: