బొత్స ఫ్యామిలీ ప్యాక్ స‌క్సెస్‌... 5 సీట్లు గెలిచేస్తారా ?

RAMAKRISHNA S.S.
- మూడు ఎమ్మెల్యే.. రెండు పార్ల‌మెంటు సీట్లు
- ఏపీలో ఏ పార్టీ... ఏ ఫ్యామిలీకి లేని ల‌క్ వీళ్ల‌కే
- విశాఖ ఎంపీగా ఝాన్సీ స్వింగ్‌.. విజ‌య‌న‌గ‌రం ఎంపీ బెల్లాన వీరి బంధువే
( ఉత్త‌రాంధ్ర - ఇండియా హెరాల్డ్ )
రాజ‌కీయాల్లో వ్యూహాలు - ప్ర‌తివ్యూహాలు ఉండాలి. ప్ర‌త్య‌ర్థిని బ‌ట్టి.. ఇటువైపు అభ్య‌ర్తుల బ‌లాబ‌లాలు నిర్ణ యించాలి. కానీ.. ఈ వ్యూహం లోపిస్తే.. మొత్తంగా పార్టీల‌కు ఇబ్బంది రావ‌డం, కావ‌డం ఖాయ‌మ‌ని అంటు న్నారు ప‌రిశీల‌కులు. విప‌క్షాలు చేసుకున్న ఇలాంటి వ్యూహాల లోపం కార‌ణంగా.. కీల‌క‌మైన నాయ‌కుడు.. బొత్స స‌త్య‌నారాయ‌ణ కుటుంబానికి ఎదురులేకుండా పోయింద‌నే వాద‌న వినిపిస్తోంది. ప్ర‌స్తుతం బొత్స కుటుంబం నుంచి న‌లుగురు బ‌రిలో ఉన్నారు. వీరంతా సేఫేన‌ని.. స‌క్సెస్ కొట్ట‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. అలాగే  విజ‌య‌న‌గ‌రం సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ కూడా బొత్స‌కు స‌మీప బంధువే.

బొత్స కుటుంబం నుంచి బొత్స స‌త్య‌నారాయ‌ణ చీపురుప‌ల్లి అసెంబ్లీ, ఆయ‌న స‌తీమ‌ణి బొత్స ఝాన్సీ విశాఖ పార్ల‌మెంటు, ఆయ‌న సోద‌రుడు.. బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య గ‌జ‌ప‌తిన‌గ‌రం, బంధువు బొడ్డుకొండ అప్ప‌ల‌నాయుడు నెల్లిమ‌ర్ల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. వీరంతా వైసీపీ బ్యాచ్‌. పైగా రాజ‌కీయ ఉద్ధండులు. అనేక ప‌ద‌వులు కూడా అనుభ‌వించిన వారు. అయితే.. వీరిపై పోటీ చేసేవారు అంత‌క‌న్నా బ‌ల‌మైన నాయ‌కులు అయి ఉండాలి. లేక‌పోతే.. స‌మానులైనా అయి ఉండాలి.

కానీ, ఈ విష‌యంలో విప‌క్షాలు రాంగ్ స్టెప్ వేశాయి. పెద్ద‌గా పోటీనే ఇవ్వ‌లేని నాయ‌కుల‌ను వీరిపై నిల‌బె ట్టాయి. దీంతో బొత్స కుటుంబం మ‌రో మాట‌లో చెప్పాలంటే.. బొత్స ఫ్యామిలీ ప్యాక్‌.. స‌క్సెస్ అయినట్టే న‌నే టాక్ ఎన్నిక‌ల‌కు ముందే వినిపించ‌డం గ‌మ‌నార్హం. దీనినిలైట్ తీసుకుంటే.. ప్ర‌తిప‌క్షాలు మ‌రింత న‌ష్ట‌పోవ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. ఎందుకంటే.. బొత్స కుటుంబానికి ఒక కీల‌క ల‌క్ష‌ణం ఉంది. వారు ఎక్క‌డ ఎప్పుడు పోటీ చేసినా..`ఇదే మా తొలి పోటీ` అనుకునిబ‌రిలో నిలుస్తారు. దీంతో ఎక్క‌డా ఒళ్లు దాచుకోకుండా క‌ష్ట‌ప‌డ‌తారు. ఇదివారి స‌క్సెస్ మంత్రం..!

నియోజ‌క‌వ‌ర్గాల వారిగా బ‌లాబ‌లాలు..!
బొత్స స‌త్య‌నారాయ‌ణ‌:  
సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్తానం ఉన్న నాయ‌కుడు. చీపురుప‌ల్లి కంచుకోట‌. ఇక్క‌డ నుంచి ఆయ‌న వ‌రుసగా పోటీచేయ‌డం గెల‌వ‌డం తెలిసిందే. కానీ, ఎప్ప‌టిక‌ప్పుడు ఆయ‌న కొత్త‌గానే ప్ర‌జ‌ల్లోకి వెళ్తారు. ఇదే ఆయ‌న స‌క్సెస్ మంత్రం. ఓపిగ్గా వింటారు. ఎవ‌రినీ ప‌క్క‌న పెట్టారు. ఇది క‌లిసి వ‌స్తోంది. ఇక్క‌డ ఈయ‌న‌పై టీడీపీ నుంచి మాజీ రాష్ట్ర చీఫ్‌, మంత్రి క‌ళా వెంక‌ట్రావును బ‌రిలో పెట్టారు. ఇది ఆయ‌నకు కొత్త నియోజ‌క‌వ‌ర్గం. అంటే.. పోటీ ప‌రంగా. పైగా.. ఈ సీటును ఆశించిన వారు హ‌ర్ట్ అయ్యారు. దీంతో క‌ళా పెద్ద‌గా పోటీ ఇచ్చే ప‌రిస్థితిలేదు.

బొత్స ఝాన్సీ:  
ఉత్తమ పార్ల‌మెంటేరియ‌న్‌గా గుర్తుంపు తెచ్చుకున్న మాజీ ఎంపీ. ప్ర‌స్తుతం విశాఖ నుంచి ఆమె బ‌రిలో ఉన్నారు. కాపు సామాజిక వ‌ర్గం ఆమెకు అండ‌గా ఉంద‌నే టాక్ ఉంది. వివాదర‌హిత నాయ‌కురాలు.. ఉన్న‌త విద్యావంతురాలు.. పైగా.. అనుభ‌వం ఉన్న నేత‌గా గుర్తింపు పొందారు. ఇక‌, టీడీపీ నుంచి బాల‌య్య రెండో అల్లుడు శ్రీభ‌ర‌త్ పోటీలో ఉన్నారు. ఈయ‌న‌పై ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నా.. ఆమేర‌కు ప్ర‌చారంలో క‌నిపించ‌డం లేదు. స‌మ‌న్వ‌యం పూర్తిగా మిస్ అయ్యింది. వైసీపీలో మాత్రం ఫుల్ జోష్ ఉంది. దీంతో ఇక్క‌డ టీడీపీకి మైన‌స్ అయ్యే అవ‌కాశం ఉంద‌నే లెక్క‌లు వ‌స్తున్నాయి.

బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య‌:  
గ‌జ‌ప‌తిన‌గ‌రం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈయ‌న‌కు మంచి పేరుంది. ఈయ‌న‌ను ఎదుర్కొనేందుకు బ‌ల‌మైన నాయ‌కుడు అవ‌స‌రం. కానీ, టీడీపీ ఇక్క‌డ రాంగ్ స్టెప్ వేసింది. కొండ‌ప‌ల్లి అప్ప‌ల‌నాయుడు(2014లో గెలిచారు)ను త‌ప్పించి.. కొండ‌ప‌ల్లి శ్రీనివాస్‌కు అవ‌కాశం ఇచ్చారు. దీంతో ఇక్క డ‌కూడా.. మ‌రోసారి అప్ప‌ల‌న‌ర‌స‌య్యే గెలుపు గుర్రం ఎక్కే అవ‌కాశంక‌నిపిస్తోంది.

బొడ్డు కొండ అప్ప‌ల‌నాయుడు:  
కీల‌క‌మైన నెల్లిమ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈయ‌న‌కు బ‌ల‌మైన కేడ‌ర్ ఉంది. ఈయ‌న‌ను ఢీ కొట్టేందుకు బ‌ల‌మైన నాయ‌కుడు అవ‌స‌రం. కానీ, పొత్తులో భాగంగా ఈ సీటును జ‌న‌సేన తీసుకుంది. పైగా లోకం మాధ‌వి అనే బ్రాహ్మ‌ణ మ‌హిళ‌కు అవ‌కాశం ఇచ్చారు. ఇది పూర్తిగా మైన‌స్ అవుతుంద‌ని అంటున్నారు. ఇక్క‌డ ఏక‌ప‌క్షంగా అప్ప‌ల నాయుడు గెలిచినా ఆశ్చ‌ర్యం లేద‌ని చెబుతున్నారు. మొత్తంగా బొత్స ఫ్యామిలీ ప్యాక్ చూస్తే.. పెద్ద‌గా పోటీ లేకుండానే విజ‌యంద‌క్కించుకునే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయ‌న్న‌ది వాస్త‌వం అంటున్నారు ప‌రిశీల‌కులు.

బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ :
ఇక బొత్స‌కు స‌మీప బంధువు అయిన బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ విజ‌య‌న‌గ‌రం ఎంపీగా మ‌రోసారి పోటీలో ఉన్నారు. ఆయ‌న‌పై శ్రీకాకుళం జిల్లాకు చెందిన క‌లిశెట్టి అప్ప‌ల‌నాయుడుకు సీటు ఇచ్చారు. ఆయ‌న ఓ ఎమ్మెల్యే నియోజ‌క‌వ‌ర్గం స్థాయికి ర‌మార‌మీగా స‌రిపోయే నేత‌. అలాంటి నేత‌కు ఏకంగా విజ‌య‌న‌గ‌రం పార్ల‌మెంటు సీటు ఇవ్వ‌డంతో స‌రిపోతారా ? అన్న సందేహాలు టీడీపీలోనే ఉన్నాయి. అప్ప‌ల‌నాయుడు గెలిచే సీన్ లేద‌ని ఇప్ప‌టికే అన్ని స‌ర్వేలు చెప్పేస్తున్నాయి. ఓవ‌రాల్‌గా ఈ ఎన్నిక‌ల్లో బొత్స‌కు ఫ్యామిలీ ఫ్యాక్ అదిరిపోయేలా క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: