జనసేన లో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ

మహరాష్ట్ర కాడర్ ఐపిఎస్ అధికారి, ముంబైలో "అదనపు సాధారణ పోలీస్ సంచాలకుడు" గా 2018 మార్చిలో స్వచ్చంద పదవీ విరమణ చేసిన వివి లక్ష్మినారాయణ తెలుగువాళ్ళకి జేడి లక్ష్మినారాయణ గానే బాగా గుర్తుంటారు.


అప్పటి నుంచి సొంత రాష్ట్రానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఏపీలో పర్యటిస్తున్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులతో సమావేశాలు నిర్వహించి, వారి కష్టాలను తెలుసు కున్నారు. ఈ క్రమం లోనే ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఒకానొక సమయంలో సొంత పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఎన్నికలకు సమయం దగ్గర పడిన కారణంగా పార్టీ పెట్టే ఆలోచనను విరమించుకున్నారని ప్రచారం జరిగింది.


లక్ష్మీనారాయణ కర్నూలుజిల్లాకు చెందిన మహారాష్ట్ర క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి. డీఐజీ హోదా లో ఉన్నప్పుడే కేంద్రానికి డిప్యుటేషన్‌ పై వెళ్ళి సీబీఐలో బాధ్యతలు చేపట్టారు. సీబీఐ డీఐజీగా 2006 జూన్‌ లో స్వరాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌లో విధుల్లో చేరారు. ఈయన సంచలనాత్మక కేసుల దర్యాప్తునకు చిరునామాగా మారి సీబీఐ హైదరాబాద్‌ విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ గా కీర్తిప్రతిష్టలు పొందటంతో తెలుగు ప్రజలకు జెడి లక్ష్మినారాయణ గానే బాగా తెలుసు.


ఓబుళా పురం మైనింగ్ కేసు,

ఎం ఆర్ ప్రోపెర్టీస్ కేస్,

సత్యం స్కాండల్,

డిస్ప్రొపెర్షినేట్ ఆస్తుల కేసు లాంటి హై ప్రొఫైల్ కేసేస్ హాండిల్ చేయటం -


నాడు ఒక అధికారిగా చేసిన బాధ్యతా నిర్వహణను నాటి ఉమ్మడి తెలుగు రాష్ట్రం ఏపిలో ఒక వర్గం మీడియా ఒక సూపర్ హీరోని చేసి ప్రచారం చేసింది. అందుకే " ఆయన ఒక వ్యక్తి - తన అధికార పదవిని మించి ప్రాముఖ్యత" సంతరించుకున్నారు. అయితే ప్రజలకు బహిర్గతమైన ఆయన చరిత్రలో ఆయన నిజాయతీ నిబద్ధతను ప్రశ్నించే సందర్భాలు కనిపించవు. 


సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది. అందుకు నేడే ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. లక్ష్మినారాయణ ఉదయం పది గంటలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అవుతారని, ఈ సందర్భంగా ఆయన పార్టీలో చేరుతారని చెబుతున్నారు.


లక్ష్మినారాయణ తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధపడినట్లు ఇటీవల ప్రచారం జరిగింది. టీడీపిలో చేరి భిమిలీ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా వార్తలు కూడా వచ్చాయి. ఆయనను టీడీపిలోకి రప్పించేందుకు మంత్రి గంటా శ్రీనివాస రావు తీవ్రంగానే కృషి చేశారు.


లక్ష్మినారాయణ టీడీపిలో చేరుతారనే వార్తలు రాగానే వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు. తమ పార్టీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు ను ప్రస్తావిస్తూ చంద్రబాబుకు, లక్ష్మినారాయణకు ఉన్న బంధం బయటపడిందని వ్యాఖ్యానించాయి.


జగన్ అక్రమాస్తుల కేసును లక్ష్మినారాయణ నేతృత్వంలోని సిబిఐ బృందం దర్యాప్తు చేసింది. అంతేకాకుండా జగన్ ను అరెస్టు చేసింది కూడా ఆయనే. చంద్రబాబు ప్రోద్బలంతోనే జగన్ పై లక్ష్మినారాయణ అతిగా వ్యవహరించారని వైసిపి నాయకులు ఆరోపించారు. 


ఈ స్థితిలో తెలుగుదేశం పార్టీలో చేరితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే అభిప్రాయంతో లక్ష్మినారాయణ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. జనసేనలో చేరాలని నిర్ణయించుకున్టన్లు చెబుతున్నారు.


వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని కొద్దిరోజుల క్రితం ప్రకటించడంతో లక్ష్మీనారాయణ ఏదొక పార్టీలో చేరడం ఖాయమనే టాక్ వినిపించింది. ఇక నాలుగు రోజుల క్రితమైతే ఆయన అధికార పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరుతారని వార్తలు వినిపించాయి. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఈ మాజీ జేడీతో చర్చలు జరిపారని, ఆయనకు భీమిలి అసెంబ్లీ సీటు కానీ, విశాఖ ఎంపీ టికెట్ కానీ కేటాయించనున్నారని పుకార్లు షికార్లు చేశాయి. వీటన్నింటికి పుల్‌స్టాప్ పెడుతూ ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు.

 

మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరనున్నారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఆయన. పవన్‌ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు. లక్ష్మీ నారాయణతో పాటు ఆయన తోడల్లుడు, మాజీ వీసీ రాజగోపాల్ కూడా జనసేనలో వెళ్లనున్నారు ఇందుకోసం ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంటకు పవన్‌ను కలిశారు. లక్ష్మీనారాయణకు జనసేన నుంచి ఎంపీ సీటు ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పవన్ హామీ ఇచ్చారని, ఆయన పార్టీలో చేరిన వెంటనే పోటీ చేసే స్థానాన్ని కూడా అధికారికంగా ప్రకటించనున్నారనే టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: