ముంబై ఇండియన్స్ కి బిగ్ షాక్.. ఆటగాళ్లందరికీ ఫైన్?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఛాంపియన్ టీం గా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ కి గత కొన్ని ఐపిఎల్ సీజన్స్ నుంచి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి అని చెప్పాలి. ప్రతి సీజన్లో కూడా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న ఆ జట్టు ఎందుకో ఆశించిన స్థాయిలో మాత్రం ప్రదర్శన చేయలేకపోతుంది. అయితే ఇలా ముంబై ఇండియన్స్ జట్టు చెత్త ప్రదర్శన నేపథ్యంలో ఏకంగా ఐదు సార్లు టైటిల్ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ సైతం పక్కన పెట్టేందుకు సాహసం చేసింది జట్టు యాజమాన్యం.

 ఇక ఎన్ని విమర్శలు వచ్చినా ఎదుర్కొంటుంది. ఇక ఇప్పుడు 2024 ఐపీఎల్ సీజన్లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో బరిలోకి దిగింది. అయితే హార్దిక్ వచ్చిన తర్వాత  ఆ జట్టుకు అదృష్టం కలిసి వస్తుంది అనుకుంటే.. ఇక అది జరగడం లేదు  ఎందుకంటే ఈ ఐపీఎల్ సీజన్లో అత్యంత చెత్త ప్రదర్శన చేస్తుంది ముంబై ఇండియన్స్. ఇక ఇప్పటికే దాదాపు ప్లే ఆఫ్ అవకాశాలను కూడా కోల్పోయింది అని చెప్పాలి. ఇప్పటివరకు పది మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ జట్టు కేవలం మూడు మ్యాచ్లలో మాత్రమే విజయం సాధించి పాయింట్లు పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతూ ఉంది అని చెప్పాలి.

 అయితే ఇటీవలే లక్నో తో జరిగిన మ్యాచ్ లో కూడా నాలుగు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది జట్టు. అయితే ఈ మ్యాచ్ లో ఓటమి మాత్రమే కాదు ఇక జట్టులోని ఆటగాళ్లు అందరికీ కూడా జరిమాన  పడింది. అదేంటి స్లో ఓవర్ రేట్ కారణంగా కేవలం కెప్టెన్ కి మాత్రమే ఫైన్ పడుతుంది కదా అంటారా.. కానీ మితిమీరిన స్లో ఓవర్ రేటు ఉండడంతో కెప్టెన్ తో పాటు జట్టు ఆటగాళ్ళు అందరికీ కూడా పైన పడింది. నిర్ణీత సమయానికి బౌలింగ్ పూర్తి చేయకపోవడంతో కెప్టెన్ పాండ్యా కి 24 లక్షల జరిమానా పడగా.. ఆటగాళ్లకు సైతం మ్యాచ్ ఫీజులో 25% లేదంటే ఆరు లక్షల పైన పడింది. ఈ సీజన్లో పాండ్యాకు ఇది రెండో ఫైన్. ఇక మరోసారి ఇలాగే జరిగితే ఒక మ్యాచ్ అటు నిషేధం ఎదురయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: