కుబేర: రేపే టీజర్.. కాన్సెప్ట్ తెలిస్తే ఆశ్చర్యపోతారు?

Purushottham Vinay
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ట్రాక్ రికార్డ్ గురించి తెలిసిందే.ఆయన ఎంత చిన్న సినిమా తీసినా కూడా ఖచ్చితంగా అందులో పెర్ఫార్మన్స్ రోల్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక ఈ మధ్యనే రిలీజ్ అయిన కుబేర ఫస్ట్ లుక్ పోస్టర్ సౌత్ మొత్తం ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూవీ పై ఉన్న అంచనాలని ఒక్కసారిగా అమాంతం పెంచేసింది.కుబేర సినిమా అప్పుడే టీజర్ రిలీజ్ కి రెడీ అయిందని సమాచారం తెలుస్తుంది. మే 2న కుబేర మూవీ టీజర్ ని రిలీజ్ చేయనున్నట్టు ఆ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసారు. ఇక కుబేర సినిమాలో ధనుష్ బెగ్గర్ దశ నుండి రిచెస్ట్ మ్యాన్ గా ఎలా మారాడన్న కథాంశంతో ఈ సినిమాని చూపిస్తున్నారని తెలుస్తుంది. ఇక ఆ మధ్య రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తో హై ఇంపాక్ట్ క్రియేట్ చేసారు మేకర్స్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో నాగార్జున ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ మూవీ తాజా షూటింగ్ షెడ్యూల్ ఇటీవల ముంబైలో ప్రారంభమైంది.


అక్కడ షూటింగ్ చేస్తూనే కుబేర టీజర్‌ను మే 2, 2024న విడుదల చేయనున్నట్లు ఈ సినిమా నిర్మాతలు ప్రకటించారు. ధనుష్ బిచ్చగాడుగా నటించిన ఈ మూవీ ఫస్ట్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన టీం టీజర్ తో ఏ రేంజ్ లో రచ్చ చేస్తారో చూడాలి.ఇక హీరో ధనుష్ కుబేర  ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడే స్టోరీ కాన్సెప్ట్ కి సంబంధించిన హింట్ కూడా ఇచ్చేసారు. బిచ్చగాడి నుండి కోటీశ్వరుడిగా ఎదిగే వైనం ఈ సినిమాలో చూపించనున్నట్టు తెలుస్తుంది. అందుకే ఈ మూవీకి కుబేర అని టైటిల్ పెట్టారు.రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో శివుడి ఫోటోని కూడా చూపించారు. దేవతల్లో శివుడి దగ్గర కేవలం బూడిద తప్ప ఇంకేమి ఉండదని అంటారు. మరి సినిమా కాన్సెప్ట్ ఏంటో అప్పటికే అర్ధమైపోయి ఉండాలి. ఇక అలాగే నాగార్జున ని ఎలా చూపిస్తున్నారో కూడా తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కుబేర సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP ఇంకా అలాగే అమిగోస్ క్రియేషన్స్ వారు సంయుక్తంగా  ఎంతో భారీగా నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: