కేటీఆర్: ఆంధ్రాలో జగనే సీఎం.. కాన్ఫిడెంట్ ఏంటి గురూ..?

Divya
ఆంధ్రప్రదేశ్లో ఇటీవలే 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాలకు సైతం ఎన్నికలు జరిగాయి.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఎన్ని సీట్లు వస్తాయని విషయం పైన ఇప్పటికి కూడ సందిగ్ధతతోనే కనిపిస్తోంది.. కానీ చాలామంది నేతలు ఇతర మాజీ సీఎంలు సైతం ఎక్కువగా వైసిపి పార్టీని అధికారంలోకి వస్తుందని ధీమాని తెలియజేస్తున్నారు. ఇప్పుడు తాజాగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. వాటి గురించి పూర్తిగా చూద్దాం.

ఎక్కడ చూసినా ఇప్పుడు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు.. ఇటీవలే తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో మరొకసారి జగనన్నే గెలుస్తాడని జోష్యం చెప్పారు.. అందుకు కారణం ఆయన చేసిన మంచి పనులే ఆయనను నిలబెడతాయని తెలిపారు.. కూటమి ఎలాగైనా గెలవాలని ప్రయత్నాలు చేస్తోంది.. ఒకవేళ ఓడిపోతే తమ ఉనికి ఉండదని భయంతోనే ఎన్నోపన్నాగాలు పన్నుతున్నాయని చెప్పవచ్చు. ఏపీ సీఎం జగనే అంటూ తమకు సమాచారం అందింది అని కూడా ఎమ్మెల్యే కేటీఆర్ తెలియజేశారు.

అయితే బిఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే తరహాలోనే ఎన్నోసార్లు వ్యాఖ్యలు కూడా తెలియజేశారు.. ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వమే ప్రజలు కోరుకుంటున్నారని కెసిఆర్ తమ అభిప్రాయంగా అన్నట్లుగా కూడా తెలియజేశారు. ఇప్పుడు కేటీఆర్ కూడా జగనే గెలుస్తారని చెప్పడంతో ఒకసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కేటీఆర్ కెసిఆర్ చెప్పినవి నిజమవుతాయో లేదో తెలియాలి అంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే.. ప్రస్తుతం బెట్టింగ్ రాయుళ్లు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పైన భారీగానే బెట్టింగ్ వేస్తున్నట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా పిఠాపురం, మంగళగిరి ,కుప్పం ఇతర ప్రాంతాలతో పాటు ఎవరికీ ఎక్కువ సీట్లు వస్తాయి ఎవరు అధికారం చేపడతారని విషయం పైన ఎక్కువగా బెట్టింగ్ వేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: