చంద్రబాబు: ప్లాన్ మొత్తం బెడిసి కొట్టిందా..?

Divya
ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ రావాలన్నా కూడా కచ్చితంగా ఉభయగోదావరి జిల్లాలలో ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తే కచ్చితంగా వారికి అధికారం వస్తుందని చెప్పవచ్చు.. అందుకే చాలామంది నేతలు తూర్పు పశ్చిమగోదావరిలలో పట్టుకోసమే అన్ని పార్టీలు సైతం ప్రయత్నిస్తూ ఉంటాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దాదాపుగా 34 స్థానాలు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా స్థానాలను గెలిపించుకోవాలని టిడిపి మొదటి నుంచి పక్క ప్లాన్ ప్రకారమే ముందుకు వెళ్ళింది.. అయితే గత ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ ఈసారి గెలవాలని పట్టుదలతో అక్కడ కాపు ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు జనసేన పార్టీని పక్కకు చేర్చుకుంది..

ఇక ఎలక్షన్ తమకు అనుకూలంగా జరగాలని బిజెపి పార్టీని కలుపుకున్నారు.. తూర్పుగోదావరి జిల్లాలో జనసేనతో పొత్తుతో భాగంగా 19 స్థానాలలో పోటీపడ్డారు. ఇందులో 15 స్థానాలను గెలవాలని భావించిన కూటమి అందుకు అనుగుణంగా అభ్యర్థులను కూడా ఎంపిక చేశారు.. అయితే కేవలం అత్యధిక స్థానాలను గెలుచుకోవడం కోసం తూర్పుగోదావరి జిల్లాలో తమ పట్టు సాధించుకోవడానికి టిడిపి పార్టీ చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ఇక్కడ అనుకున్నంత స్థాయిలో ఓట్ల బదిలీ జరగలేదని వార్తలు వినిపిస్తున్నాయి.

టిడిపి నేతలకు ఈ విషయం కాస్త ఆందోళన గురి చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యమైన స్థానాలలో వైసిపి చివరి నిమిషంలో పోటీకి దూసుకుపోవడంతో అభ్యర్థుల గెలుపోవటములపైన చాలామంది తెలుగు తమ్ముళ్లు సైతం దిగులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ప్రాంతాలలో జగన్ చేసిన సోషల్ ఇంజనీరింగ్ మంచి ఫలితాలను ఇస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా శెట్టిబలిజలకు రెండు పార్లమెంటు స్థానాలను కేటాయించడంతో అక్కడ వారి ఓట్లు అన్ని కూడా అసెంబ్లీ స్థానాలకు అధికంగా పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ 80 శాతం వరకు శెట్టిబలిజిలు ఫ్యాన్ గుర్తుపైనే ఓటు వేశారని సమాచారం. దీంతో టీడీపీ ప్లాన్ ఇక్కడ వర్క్ అవుట్ కాలేదని వార్తలు వినిపిస్తున్నాయి.
అలాగే మైనారిటీ ఓట్లు కూడా వన్ సైడ్ గా వైసీపీ పార్టీ వైపు ఉన్నాయని బీసీ ఎస్సీ ఎస్టీ ఓటర్లు కూడా అధిక శాతం మంది వైసీపీ పార్టీకి ఓటు వేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఫలితాలు ఏవనేవి జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: