అమరావతి, పోలవరం ఫుల్ ఫామ్ లోకి అంటున్న సామాన్యులు.. బాబుగారూ విన్నారా?

Reddy P Rajasekhar
నవ్యాంధ్రప్రదేశ్ కు చంద్రబాబు మరోసారి సీఎం కావడంతో ఏపీలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని యువత, సామాన్యులు భావిస్తున్నారు. చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయకముందే అమరావతి ఏపీకి ఏకైక రాజధాని అనే స్పష్టత రావడంతో పాటు అటు అమరావతి ఇటు పోలవరం పనులు వేగంగా మొదలయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. మరోవైపు కేంద్రం నుంచి ఏపీకి పన్నుల వాటాల్లో భాగంగా రావాల్సిన మొత్తం కూడా దక్కుతుండటం గమనార్హం.
 
అమరావతి, పోలవరం ఫుల్ ఫామ్ లోకి వచ్చాయంటూ సామాన్యులు కామెంట్లు చేస్తుండగా ఏపీ ప్రజల నుంచి పాజిటివ్ గా వ్యక్తమవుతున్న ఈ కామెంట్ల గురించి చంద్రబాబు నాయుడు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. అమరావతి, పోలవరం శరవేగంగా పూర్తైతే ఏపీ యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు వ్యవసాయ రంగంలో రాష్ట్రంలో ఊహించని స్థాయిలో ఫలితాలను సాధించే ఛాన్స్ అయితే ఉంటుంది
 
ఆంధ్రుల కలల రాజధాని అమరావతి పూర్తైతే ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాలు పెరగడంతో పాటు ఏపీ యువత వైట్ కాలర్ జాబ్స్ కోసం ఇతర రాష్ట్రాల వైపు చూసే అవకాశాలు అయితే ఉండవని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు మరో 20 ఏళ్ల తర్వాత ఏపీ ఎలా ఉండాలో ఇతర రాష్ట్రాలకు ఏ విధంగా గట్టి పోటీ ఇచ్చే స్థాయికి రాష్ట్రం ఎదగాలో ఆలోచిస్తూ అదే విధంగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.
 
చంద్రబాబు నాయుడు కేంద్రం మద్దతుతో అభివృద్ధి, సంక్షేమం విషయంలో నూటికి నూరు మార్కులు సాధిస్తే మాత్రం ఈ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో కూటమిని గెలిపించిన ఓటర్లు భవిష్యత్తులో సైతం అండగా నిలబడే అవకాశాలు అయితే ఉంటాయి. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకుండానే ఇచ్చిన హామీలతో ప్రజల మనస్సు గెలుచుకున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు వయస్సు పెరుగుతున్నా ఆయన ఆలోచనలు మాత్రం యంగ్ జనరేషన్ ఆలోచనలలా ఉంటాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: