మోదీ... దిగి వస్తున్నారా? ఆంధ్రోడా మజాకా?

Divya

ఎట్టకేలకు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే . మొత్తానికైతే వాజ్పేయి గతంలో మూడుసార్లు ప్రధానమంత్రిగా దేశాన్ని పరిపాలించగా ఇప్పుడు ఆ రికార్డులను సమం చేస్తూ నరేంద్ర మోదీ కూడా మూడవసారి ప్రమాణ స్వీకారం చేశారు.. ఇటీవల కేంద్ర మంత్రులు కూడా మోదీతో పాటు ఏకంగా 50 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ వంతు వచ్చింది. తాజాగా కూటమి తరపున సీఎం కాబోతున్న చంద్రబాబునాయుడు ఈరోజు 11 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్ కి  కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి చిరంజీవి సతీ సమేతంగా హాజరుకానున్నారు.అలాగే పలువురు సినీ సెలబ్రిటీలు కూడా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి విచ్చేయనున్నారు.. నిజానికి బిజెపి సౌత్ లో చాలా తక్కువగానే బలాబలాలు కనబరుస్తున్న విషయం తెలిసిందే.. పైగా నార్త్ కే పరిమితమైన నరేంద్ర మోడీ సౌత్ పైన ఎక్కువగా ఫోకస్ చేయలేదు..  కానీ.. నేడు ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ లెవెల్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన నేపథ్యంలో.. ఎట్టకేలకు మోడీ దిగిరాక తప్పలేదు.. పైగా ఇక్కడ కూటమి లో భాగంగా బిజెపి -  టిడిపి - జనసేన పొత్తు కలుపుకున్న విషయం తెలిసిందే. అక్కడ ఎన్ డి ఏ కూటమితో పొత్తు పెట్టుకుని అధికారంలోకి రాగా ఇక్కడ కూడా కూటమి అధికారంలోకి వచ్చింది.
ఇందులో భాగంగానే బిజెపి కూడా ఆంధ్రప్రదేశ్లో బలం కానున్న నేపథ్యంలో తమ కమలం పార్టీని మరింత బలం చేయడానికి.. మరొకవైపు ఆంధ్రప్రదేశ్ సీఎం పదవి ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ ప్రత్యేక అతిధిగా రాబోతున్నారు.. పైగా కూటమిని గెలిపించి ప్రధానమంత్రినే ఇక్కడికి రప్పిస్తున్నారు అంటే ఆంధ్రుడా మజాకా అంటూ పలువురు రాష్ట్రాల ప్రజలు,  నేతలు కూడా కామెంట్లు చేస్తున్నారు.. ఏది ఏమైనా ఆంధ్రుడు తలచుకుంటే కొండమీద కోతిని అయినా దించగలడు అని మరొకసారి నిరూపించారు. మరి ఈరోజు ప్రమాణ స్వీకారంలో మోడీ ఆంధ్రప్రదేశ్ ఓటర్లను ఉద్దేశించి ఏదైనా ప్రసంగిస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: