CBN.. ఇట్స్ ఏ బ్రాండ్: విజన్ 2047కి అమరావతి వేదికవుతోందా?

Purushottham Vinay

•CBN అంటే నేమ్ కాదు.. ఇట్స్ ఏ బ్రాండ్
 
•విజన్ 2047కి వేదికగా అమరావతి
 
•దేవతల రాజధానిని తలపించేలా ఆంధ్ర రాజధాని అభివృద్ధి పక్కా
 
•భవిష్యత్తులో హైదరాబాద్ని తలదన్నెలా అమరావతి అభివృద్ధిపై బాబు ప్రణాళికలు

అమరావతి - ఇండియా హెరాల్డ్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అధిపతిగా చంద్ర బాబు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించనున్నారు. ఇప్పుడు అందరి చూపు రాజధాని అమరావతి పై పడింది. రాబోయే 5 ఏళ్లలో చంద్రబాబు అమరావతిని ఎలా అభివృద్ధి చేస్తారో అని ఆసక్తిగా ఉన్నారు ఆంధ్రులు. చంద్రబాబు మంచి విజనరి నేత. అంత గొప్ప నేత కాబట్టి నేడు హైదరాబాద్ అనే ఒక సిటీ వరల్డ్ ఫేమస్ అయ్యింది. హైదరాబాద్ ని టాప్ లో నెలబెట్టారు సీబీఎన్.ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కూడా బాబు టాప్ సిటీగా మారుస్తాడని అనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా చంద్రబాబు గాయపడి గెలిచిన సింహం లాంటి నేత కాబట్టి ఈసారి ఖచ్చితంగా అమరావతిని అభివృద్ధి చేస్తాడు. అమరావతి అంటే మన పురాణాల ప్రకారం దేవతల నగరం. అలాంటి దేవతల నాగరాన్ని తలపించేలా ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మించేలా చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. దానికి 2014 లో పనులు మొదలు పెట్టారు. అప్పుడే ప్రణాళికలు వేసుకున్నారు.

కానీ 2019 లో చంద్రబాబు ఓడిపోయాక జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమరావతి పనులు జరగలేదు. దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా ఆంధ్రులకు రాజధాని లేదని ఎగతాళి చేశారు. ఇప్పుడు చంద్రబాబు అధికారం లోకి వచ్చాడు కాబట్టి అమరావతిని హైదరాబాద్ని తలదన్నెలా అభివృద్ధి చేస్తాడని ఆంధ్రులు ఎంతో ఆశగా ఉన్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రతి తెలుగోడు గర్వపడేలా అభివృద్ధి చేస్తాడు. ఇప్పుడు లేట్ అవ్వొచ్చేమో కానీ భవిష్యత్తులో అమరావతి దేశంలోనే పవర్ ఫుల్ రాజధాని అవ్వడం పక్కా. అలా చెయ్యడం ఒక్క చంద్రబాబుకే సాధ్యం. ఎందుకంటే చంద్రబాబు అంటే ఒక బ్రాండ్. హైదరాబాద్ ని వరల్డ్ ఫేమస్ సిటీగా మార్చిన ఘనత చంద్రబాబుదే. కాబట్టి ఖచ్చితంగా బాబు అమరావతిని కూడా చాలా ఫాస్ట్ గా డెవలప్ చేస్తాడు.విజన్ 2047 కి అమరావతి ఖచ్చితంగా వేదిక అవుతుంది. అది చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: