బాబు-పవన్.. నాయకులా? పొలిటికల్ ఉద్దండులా? ఎక్కడో తేడా కొడుతోంది రాజా!?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. మరికొద్ది క్షణాల్లోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అటు... డిప్యూటీ సీఎం గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణం శ్రీకారం చేస్తారు. ఇక వీరితోపాటు మరో 22 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే... ఈ స్థాయికి చేరుకోవడానికి తెలుగుదేశం, జనసేన పార్టీలు చాలా కష్టపడ్డాయి. ముఖ్యంగా ఈ విజయానికి పవన్ కళ్యాణ్ కారణమని అందరికీ తెలుసు.


కాబట్టి పవన్ కళ్యాణ్ కు తగిన స్థాయి కల్పించేందుకు మొదటి నుంచి చంద్రబాబు నాయుడు  ప్రయత్నిస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు... ఒక మెట్టు దిగి మరి... చంద్రబాబు దగ్గరికి వెళ్లారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ సందర్భంగా తెలుగుదేశం కూటమికి విత్తనం పడింది. ఇక అక్కడి నుంచి.. తెలుగుదేశం కూటమికి బ్రేకులు ఎక్కడా పడలేదు. 151 సీట్లు ఉన్న వైసీపీ పార్టీని... భూస్థాపితం చేశారు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు.


 అయితే జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టడమే కాకుండా.. చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా జాగ్రత్తలు పడుతున్నారు ఈ ఇద్దరు నాయకులు. తెలుగుదేశం కూటమి కార్యవర్గ సమావేశం సందర్భంగా కూడా...  పవన్ కళ్యాణ్ కు మర్యాద ఇచ్చేలా... చంద్రబాబు వ్యవహరించారు. ప్రత్యేకంగా చంద్రబాబు కోసం కుర్చీ వేస్తే దాన్ని పక్కకు పెట్టి మరి... పవన్ కళ్యాణ్ కు సమానంగా ఉన్న కుర్చీలో కూర్చున్నారు బాబు.
అటు కూటమి ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు... చంద్రబాబు నాయుడు ను పొగుడుతూనే పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు.

నేరుగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండాలని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అలా ఈ ఇద్దరు నాయకులు ఒకరినొకరు పొగుడుకుంటూ... ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఈ ఇద్దరు నాయకుల మధ్య సాన్నిహిత్యం ఎన్ని రోజుల వరకు కొనసాగుతుందో అని అందరు చర్చించుకుంటున్నారు. ఎంత పెద్ద నాయకులైన చిన్న చిన్న గొడవల వల్ల... విడిపోవడం మనం చూసాం. అయితే ఈ ఐదేళ్ల పాలనలో.. ఈ ఇద్దరు నాయకులు ఎప్పుడైనా విడిపోవచ్చు అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అయితే ఆ చీలిక తెలుగుదేశం నుంచి వస్తుందా ? లేక జనసేన పార్టీ నుంచి వస్తుందా అని అందరూ  చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: